Ashu Reddy : అలాంటి వాడే మొగుడుగా కావాలి.. ఓపెన్ అయిపోయిన ఆషూ రెడ్డి.. తెగ బాధ పడుతోన్న రామ్ గోపాల్ వర్మ..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: February 25, 2023, 8:00 pm

Ashu Reddy : ఎప్పుడైతే సోషల్ మీడియా జనాల్లోకి బాగా వచ్చేసిందో అప్పటి నుంచి సోషల్ మీడియా స్టార్లు పుట్టుకొచ్చారు. అందులో నుంచి పుట్టిందే అషు రెడ్డి. సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిన అషు రెడ్డి ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు సాధించుకుంది. బిగ్ బాస్ 3 లోనూ అవకాశం రావడంతో ఇక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత తనకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. తనకు సమంత పోలికలు ఉండటంతో తనను అందరూ జూనియర్ సమంత అని కూడా పిలిచేవారు.

ashu reddy latest comments on her future husband viral

ashu reddy latest comments on her future husband viral

సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకొని అషు రెడ్డి సెలబ్రిటీ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ చేతుల్లో పడి మరింత పాపులారిటీని తెచ్చుకుంది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన డేర్ అండ్ డాషింగ్ లేడీ అనిపించుకుంది అషు రెడ్డి. ఇక.. తన సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోను ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కోసం వదులుతూ ఉంటుంది అషు రెడ్డి. తాజాగా తను ఆగ్రా వెళ్లి అక్కడ తాజ్ మహల్ ముందు ఫోటోషూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ashu reddy latest comments on her future husband viral

ashu reddy latest comments on her future husband viral

Ashu Reddy : తనకు కాబోయే లవర్ అలా ఉండాలట

తనకు కాబోయే లవర్ ఎలా ఉండాలో కూడా ఓ పోస్ట్ చేస్తూ చెప్పుకొచ్చింది అషు రెడ్డి. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ ను నిర్మిస్తే.. షాజహాన్ లా ప్రేమించే వ్యక్తే తనకు కావాలట. అంటే అషు రెడ్డి కోసం తాజ్ మహల్ లాంటి కట్టడాన్ని తన లవర్ కట్టించాలన్నమాట. సోషల్ మీడియాలో తన బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలో చెప్పడం.. దానికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేయడంతో ఆ ఫోటోలను కుర్రాళ్లు తెగ వైరల్ చేస్తున్నారు. వామ్మో.. నీకోసం నీ ప్రియుడిని మరో తాజ్ మహల్ కట్టించమంటున్నావా అషు అంటూ నెటిజన్లు తనపై ట్రోల్స్ స్టార్ట్ చేశారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp