Samantha : సమంత రెండో పెళ్లి చేసుకుంటే అంటూ వేణు స్వామి సంచలన జాతకం వీడియో వైరల్..!!
Samantha : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలుగు రాష్ట్రాలలో అందరికీ సుపరిచితుడే. చాలామంది సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల జీవితాలలో జరగబోయే విషయాలను ముందే తెలియజేస్తుంటారు. ఈయన చెప్పిన చాలా విషయాలు నిజం కావడంతో ఇప్పుడు ఈయన చాలా పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. ఇదే సమయంలో వేణు స్వామి చేత ప్రత్యేకమైన పూజలు చేయించుకుని ఓ మాదిరి ఇమేజ్ కలిగిన హీరోయిన్స్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు.
చాలామంది సెలబ్రిటీలు వేణు స్వామి సూచనలను పరిగణలోకి తీసుకొని తమ కెరియర్ డిజైన్ చేసుకుంటారు. ఇలా ఉంటే సమంత భవిష్యత్తు గురించి తాజాగా వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత నాగచైతన్య ముందే విడిపోతారని అప్పట్లోనే తన చెబితే అందరూ నవ్వేరని కానీ ఇప్పుడు పరిస్థితి.. చూడండి. నేను చెప్పే విషయాలు మొదట కామెడీగా ఉండొచ్చు కానీ తర్వాత అవే వాస్తవం రూపం దాల్చుకుంటాయి. ఈ రకంగా విడిపోయే జంటలలో గురువు నీచంలో ఉంటాడు.
సమంతాకి కూడా ఆ రకమైన జాతకం. ఆమె రెండో పెళ్లి చేసుకున్న ఆరోగ్యంగా ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇదే రకమైన జాతకం చిరంజీవి మూడో కూతురిది కూడా. సేమ్ వాళ్ళ బాబాయి పవన్ కళ్యాణ్ జాతకం లాంటిదే శ్రీజాది. ఆమె త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతుంది అని పేర్కొన్నారు. వీళ్లు పెళ్లిళ్లు చేసుకున్న జాతకంలో గురువు నీచమైన స్థితిలో ఉండటంతో.. సంసార జీవితం ముందుకు సాగదు అని వేణుగోపాలస్వామి స్పష్టం చేశారు.
