Avika Gor : అందంతో క‌ట్టిప‌డేస్తున్న అవికా గోర్.. కేక పెట్టిస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: May 23, 2022, 8:30 pm

Avika Gor : ఒకప్పుడు అమాయకంగా.. చాలా సంప్రదాయంగా కనిపించిన చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు రెచ్చిపోతుంది. చిన్నారి పెళ్లి కూతురు అంటే ఠ‌క్కున అవికా గోర్ గుర్తుకు వ‌స్తుంది. అప్పట్లో ఎంత చక్కగా ఉండేది పిల్లా.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది అంటున్నారు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా అవికా గోర్ చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ ద్వారా క్రేజ్ అందుకుంది. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఆ సీరియల్ కు మంచి గుర్తింపు వచ్చింది. అందులో ఎన్ని క్యారెక్టర్స్ మారినా కూడా అవికా గోర్ క్యారెక్టర్ ఎక్కువగా హైలెట్ అయ్యింది. అనంతరం మరికొన్ని సీరియల్స్ తో కూడా ఆమె మంచి గుర్తింపు అందుకుంది.

ఉయ్యాల జంపాల సినిమాతో క‌థానాయిక‌గా కూడా మారింది.ఆ తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ వంటి వరుస సినిమాల్లో నటించిన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత సినిమాలకు కాస్తా బ్రేక్‌ ఇచ్చిన అవికా ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చింది. అక్కడ ప్రైవేటు సాంగ్స్‌, అల్భమ్స్‌తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో నాగచైతన్య, రాశిఖన్నాల థ్యాంక్యూ చిత్రంతో తిరిగి తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇటీవల నెట్‌ సినిమాతో ఫ్యాన్స్‌ను పలకరించింది. ఇక ఇప్పుడు ఆమె ‘బ్రో’ అనే కొత్త సినిమాతో రాబోతోంది.

avika gor mesmarize the audience

avika gor mesmarize the audience

Avika Gor : అవికా సంద‌డి..

అవికా గోర్ యాక్టింగ్ కెరీర్ విషయంలో ఎలా ఉన్నా కూడా గ్లామర్ తో మాత్రం ఊహించని విధంగా షాక్ ఇస్తోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది. రోజురోజుకు మరింత ఘాటుగా కనిపిస్తున్న అవికా గోర్ ఇటీవల మరోసారి అంతకుమించి అనేలా గ్లామర్ హీట్ తో రెచ్చిపోయింది. తాజాగా ప‌ర్పుల్ క‌ల‌ర్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాల‌తో మెంట‌లెక్కిస్తుంది. అవికా క్యూట్ అండ్ గ్లామ‌ర్ పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అమ్మ‌డి పిక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp