దటీజ్ ఫ్రెండ్ షిప్.. కష్టకాలంలో అవినాష్‌కు అండగా శ్రీముఖి
Avinash And Sreemukhi : శ్రీముఖి, అవినాష్ మధ్య ఎంతటి సన్నిహిత సంబంధాలున్నాయో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో కంటే ముందుగానే ఈ ఇద్దరూ కలిసి ఓ షోను చేశారు. ఉమెనియా అంటూ శ్రీముఖి హోస్ట్ చేసిన ఓ షోలో అవినాష్ రచ్చ చేశాడు. అలా జబర్దస్త్, ఇతర వేదికల ద్వారా ఏర్పడిన ఈ స్నేహమే అవినాష్‌కు ఉపయోగపడింది. జీవితంలో ఎంతో సాయపడింది. శ్రీముఖి చేసిన సాయం గురించి తాజాగా అవినాష్ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

Avinash Emotional On Sreemukhi
బిగ్ బాస్ షోలోకి అవినాష్ వెళ్లేందుకు ఎంతో కష్టపడ్డాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోకు వెళ్లాలంటే అగ్రిమెంట్ ప్రకారం మల్లెమాలకు పది లక్షలు కట్టాల్సిందేననని పట్టుబట్టారట. అలా మొత్తానికి మల్లెమాలకు పది లక్షలు కట్టేసి బిగ్ బాస్ షోకు వెళ్లాడు అవినాష్. అయితే ఆ సమయంలో అండగా నిలబడింది మాత్రం శ్రీముఖి అంటూ చెప్పుకొచ్చాడు.
Avinash And Sreemukhi : కష్టకాలంలో అవినాష్‌కు అండగా శ్రీముఖి

Avinash Emotional On Sreemukhi
లాక్డౌన్, షోలు లేకపోవడం, అదే సమయంలో ఇళ్లు కట్టుకోవడం, ఆరోగ్య సమస్యలు ఇలా అన్నీ ఒకే సారి రావడంతో ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్లినట్టు అవినాష్ చెప్పుకొచ్చాడు. తాజాగా అవినాష్ ఇవన్నీ మరోసారి గుర్తుకు చేసుకున్నాడు. ఆ సమయంలో శ్రీముఖి అండగా ఉందని, తన కష్టాలను తెలుసుకుని డబ్బులు ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. అలా శ్రీముఖి స్నేహబంధానికి ఇచ్చిన విలువను చూసి అవినాష్ ఎమోషనల్ అయ్యాడు.
#Avinash in and as @MukhiSree . Vella gang friendship mamooluga undadu!!#ComedyStars Sunday at 1:30 PM on #StarMaa #SundayFunday pic.twitter.com/1VmAdNqyHc
— starmaa (@StarMaa) July 29, 2021