Avinash-Ariyana : అరియానా అవినాష్ మధ్య గొడవలు.. ఆర్జీవీ పెట్టిన చిచ్చు!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 5 September 2021, 7:30 pm

Avinash-Ariyana : అరియానా అవినాష్‌లు బిగ్ బాస్ షో నుంచి మంచి స్నేహితులుగా మారారు. బిగ్ బాస్ ఆట ముగిసినా కూడా వీరి బంధం ముగియలేదు. ఇంకాస్త దగ్గరయ్యారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. అయితే అరియానా వ్యవహారం అందరికీ తెలిసిందే. ఏదైనా సలహాలు ఇచ్చినా, చెప్పినా పట్టించుకోదు. నీకెందుకు? నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతుంది. అలానే అవినాష్‌ను కూడా అనేసిందిట. దీంతో ఈ ఇద్దరి మధ్య మాటలు లేవని తెలుస్తోంది. దాదాపు రెండు మూడు నెలలు మాట్లాడకుండా దూరంగానే ఉన్నారట.

Avinash Is Away With Ariyana About RGV Issue

Avinash Is Away With Ariyana About RGV Issue

తాజాగా ఈ విషయాలన్నీ వారిద్దరే చెప్పారు. కామెడీ స్టార్స్ షోలో చాలా గ్యాప్ తరువాత అవినాష్ స్కిట్‌లో అరియానా చేసింది. ఇన్ని రోజులు మాట్లాడుకోలేదని, తాను ఎంత ప్రయత్నించినా అవినాష్ మాట్లాడలేదని అరియానా చెప్పుకొచ్చింది. మంచి చెబితే.. ఆ దారిలో నడవకు అని చెబితే.. నీకెందుకు అని అరియానా అంది.. అందుకే దూరంగా ఉండిపోయాను అని అవినాష్ చెప్పుకొచ్చాడు .అయితే ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి గల కారణాన్ని అవినాష్ తన స్కిట్ రూపంలో చెప్పకనే చెప్పేశాడు.

 

Avinash Is Away With Ariyana About RGV Issue

Avinash Is Away With Ariyana About RGV Issue

వర్మతో అరియానా చేసిన చెత్త ఇంటర్వ్యూ అవినాష్‌కు నచ్చలేదేమో. దాన్ని స్ఫూప్‌గా చేస్తూ అరియానా మీద కోపం తీర్చుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ చేసినందుకు ఎంత కోపం ఉందో అవినాష్ చూపించాడు. అయితే వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా అరియానాను అందరూ ఏకిపారేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె మీద విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. అదే విషయాన్ని అవినాష్ చెబితే.. అరియానా అర్థం చేసుకోనట్టుంది. మొత్తానికి అరియానా అవినాష్ మధ్య అలా వర్మ చిచ్చు పెట్టినట్టు అయింది.

Avinash Is Away With Ariyana About RGV Issue

Avinash Is Away With Ariyana About RGV Issue

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి