Avinash : షోలో రెచ్చిపోయిన అవినాష్.. కౌంటర్ వేసిన చెల్లెలి కాపురం పౌర్ణమి
Avinash : జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు అవినాష్. ముక్కు అవినాష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ కమెడీయన్ బిగ్ బాస్ షోలో కూడా సందడి చేశాడు. షోలో ఉన్నన్ని రోజులు తెగ రచ్చ చేసిన అవినాష్ ఇప్పుడు మా టీవీ షోలలో రచ్చ చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో కాస్త ఓవరాక్షన్ చేస్తూ అవినాష్ కాస్త అతినాష్ గా మారిపోయారు.ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న అవినాష్ బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ మధ్య కాలంలోనే అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా వివాహం తర్వాత అవినాష్ తన భార్యతో కలిసి ఈవెంట్లకు, హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం అవినాష్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ 2లో తన భార్యతో కలిసి అలరిస్తున్నాడు. అయితే ఈ కార్యక్రమంలో విలేజ్ కుకింగ్ థీమ్ తో షో ప్రసారం కాగా, ఇందులో అందరు వెరైటీ వంటకాలతో ఓంకార్‌ని ఇంప్రెస్ చేశారు. గోరు ముద్దలు కలిపి ఓంకార్ ఒక్కొక్కరికి తినిపిస్తుండగా, చెల్లెలి కాపురం పౌర్ణమి కూడా తినిపించాడు. అయితే ఆ సమయంలో అవినాష్ బాగుందా అని అడిగాడు. దానికి బాగుంది అనగా, వెంటనే అవినాష్ బాగుందంటా, మణికొండలో కర్రీ పాయింట్ పెడతున్నా వచ్చేయండి అంటూ రచ్చ చేశాడు. అవినాష్ ఫన్‌కి ప్రతి ఒక్కరు ఇరగబడి నవ్వేశారు.

Avinash plans to curry point
Avinash : కర్రీ పాయింట్ పెడతా అంటూ రచ్చ..
ఇక మిగతా టీం సభ్యులు కూడా వంటలు తింటూ వినోదం పంచుతూ అలరిస్తూ వచ్చారు. అవినాష్ తన భార్యతో కలిసి పలు స్కిట్స్, డ్యాన్స్ లు ఇలా రచ్చ చేస్తున్నాడు. వీరిద్దరూ ఎన్నో టాస్క్ లలో పాల్గొంటూ ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఓంకార్ ఈ జోడిలతో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు. ఈ క్రమంలోనే అవినాష్ తన భార్య అనూజతో కలిసి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. “ఏం చేశామో ఏమో మాకే అర్థం కావడం లేదు….కానీ ఏదో చేశాం” అంటూ చెప్పుకొచ్చారు.ఇలా అవినాష్ వారి డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి కామెంట్ చేయడంతో వెంటనే తన స్నేహితురాలు బుల్లితెర యాంకర్ శ్రీముఖి స్పందిస్తూ తనదైనశైలిలో కామెంట్ చేసింది.