Vaishnavi Chaitanya : బేబీ సినిమా కోసం వైష్ణవి చైతన్య అంత డబ్బు తీసుకుందా ? టాప్ హీరోయిన్ లు కూడా పనికిరారు !
Vaishnavi Chaitanya : విజయ్ దేవరకొండ తమ్ముడు అయినా ఆనంద్ దేవరకొండ తెలుగులో దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అన్నలా మాస్ సినిమాలు కాకుండా యూత్ ఎంటర్టైన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ హీరోగా రాజేష్ సాయి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా బేబీ. ఈ సినిమాను ఎస్.కె.ఎన్ నిర్మించారు. అయితే ఈ సినిమాలో ఆనంద్ జోడిగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. రీసెంట్గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ మాత్రం సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేసింది.
ఈ సినిమాలో యూత్ ఆడియన్స్ కి కావాల్సిన ఎమోషన్ ఉంది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య డి గ్లామర్ ఛాలెంజింగ్ రోల్ చేసింది. అయితే ఈ సినిమా టైంలో హీరోయిన్ ని వెతుకుతున్నప్పుడు ఒకరిద్దరిని చూసి వైష్ణవి చైతన్యను ఓకే చేశారట. అయితే చాలామంది ఆమె అనేసరికి వెబ్ సిరీస్ యాక్టర్ కదా, షార్ట్ ఫిలిం యాక్టర్ కదా అని అన్నారట. అంతేకాదు చాలామంది డైరెక్టర్ సాయి రాజేష్ కి ఆమెను తొలగించాలని చెప్పారట. అయినా కూడా సాయి రాజేష్ ఆమెను తన సినిమాలో తీసుకున్నారట. ఇక సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ చూశాక తన నిర్ణయం కరెక్ట్ అని అనుకున్నాడు డైరెక్టర్.
ఈ సినిమా విడుదల తర్వాత ఆమెను వద్దనుకున్న వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుందని సాయి రాజేష్ అంటున్నారు. క్యూట్ లవ్ స్టోరీ తో రాబోతున్న ఈ సినిమా టీజర్ తోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. వెబ్ సిరీస్ చేసినంత మాత్రానా హీరోయిన్ గా పనికిరారా లేక వెబ్ సిరీస్ మాత్రమే చేస్తూ ఉండాల అని కొందరు అంటున్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అంటున్నారు. ఆనంద్ వైష్ణవిల జోడి బాగుందని అంటున్నారు. ఈ సినిమాలో వైష్ణవి గ్లామర్ లుక్కులో కనిపిస్తుంది. దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆనంద్ వరుస సినిమాలను చేస్తూ అలరిస్తున్నాడు. ఆనంద్ కి ఈ సినిమా మరో హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి.