Baby Sequel : బేబీ రెండో పార్ట్ రాబోతోంది.. స్టోరీ ఏంటి..?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 6, 2023, 3:00 pm

Baby Sequel : బేబీ సినిమా గురించి తెలుసు కదా. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి టాలీవుడ్ బాక్సాఫీసును బద్దలు కొట్టింది. టాలీవుడ్ లో ఒక మంచి హిట్ గా నిలిచింది బేబీ మూవీ. ఈ సినిమా కోసం డైరెక్టర్ సాయి రాజేష్ చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టానికి ఫలితం దక్కింది. ఈ సినిమాలో నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటనకు కూడా బాగా మార్కులు పడ్డాయి. ఈ సినిమా మ్యూజికల్ గానూ హిట్ అయింది. సినిమా అయితే ప్రతి ఒక్కరికి నచ్చింది. ఈ ఇయర్ లో వచ్చిన సినిమాల్లో బెస్ట్ మూవీగా నిరూపించుకుంది.

అయితే.. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందట. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ గురించే పెద్ద చర్చ నడుస్తోంది. అసలు బేబీ సీక్వెల్ వస్తే స్టోరీ ఏంటి అని అందరూ స్టోరీని గెస్ చేస్తున్నారు. సాయిరాజేష్ బేబీ సీక్వెల్ ను తీయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. బేబీ మొదటి పార్ట్ సక్సెస్ కావడంతో ఇక రెండో పార్ట్ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సీక్వెల్ లో స్టోరీ ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇదే స్టోరీని కంటిన్యూ చేస్తారా? లేక వేరే కొత్త స్టోరీని తీసుకొస్తారా అనే విషయం తెలియదు కానీ.. ఈ సినిమాకు సీక్వెల్ మాత్రం త్వరలోనే రాబోతోంది.

baby movie director sai rajesh to direct baby sequel movie

baby movie director sai rajesh to direct baby sequel movie

Baby Sequel : హీరో హీరోయిన్లు మళ్లీ వాళ్లేనా?

మరి ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించిన ముగ్గురు అంటే ఒకరు విజయ్ దేవరకొండ, మరొకరు బేబీ వైష్ణవి, విరాజ్ అశ్విన్.. ఈ ముగ్గురే సీక్వెల్ లో ఉంటారా? లే ఈ ముగ్గురిని మార్చి వేరే వాళ్లతో సినిమా తీస్తాడా అనేది తెలియదు కానీ.. సాయి రాజేష్ మాత్రం త్వరలోనే బేబీ సీక్వెల్ ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజం అయితే.. బేబీ సీక్వెల్ కథ ఏంటి.. హీరో హీరోయిన్లు ఎవరు అనేది తెలుసుకోవడం కోసం నెటిజన్లు మాత్రం తెగ పోటీ పడుతున్నారు. ఆ వివరాలన్నీ ఎప్పుడు తెలుస్తాయో వేచి చూడాల్సిందే.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp