Anchor Ravi : నాన్న కోసం ఎదురుచూపులు.. యాంకర్ రవి కూతురు మామూల్ది కాదు..!
Anchor Ravi యాంకర్ రవి Anchor Ravi కి సోషల్ మీడియాలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్ రవి Anchor Ravi తన ఫ్యామిలీతో కలిసి చేసే అల్లరి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రవి తన కూతురు వియాతో చేసే అల్లరి పనులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక తన కూతురు కోరిన వంటలను వండేందుకు రవి Anchor Ravi పడే కష్టాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. కూతురి కోరికలను తీర్చేందుకు రవి తెగ కష్టపడుతుంటాడు.. ఒక్కోసారి అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి కూడా. అలా రవి, వియాలు కలిసి సోషల్ మీడియాలో బాగానే ఆడుకుంటారు.

Baby Viya Missing Her Dad Anchor Ravi
తన బిడ్డ కోసం ప్రత్యేకంగా ఇన్ స్టాగ్రాం : Anchor Ravi
ఇక వియాకు ఉన్న ఫాలోయింగ్, ఆదరణను చూసి రవి మంచి ప్లానే వేశారు. తన బిడ్డ కోసం ప్రత్యేకంగా ఇన్ స్టాగ్రాం ఖాతాను ప్రారంభించాడు. ఇక అంతే కాకుండా యూట్యూబ్‌లో ఓ కొత్త చానెల్‌ను కూడాపెట్టేశాడు. ప్రిన్సెస్ వియా అంటూ ప్రారంభించిన ఈ చానెల్‌లో క్యూట్ క్యూట్ వీడియోలను పెడుతున్నారు. మొన్నీ మధ్యే తన ఫాలోవర్లందరితో వియా ముచ్చట్లు పెట్టింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పింది. అలా వియా ఇప్పుడు నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఇక తాజాగా తండ్రి కోసం తెగ బాధపడుతోంది. ఇంట్లో ఎక్కువగా ఉండటం లేదని, ఎప్పుడూ షూటింగ్‌లని తిరుగుతున్నాడని వాపోయింది. ఆయన షూటింగ్‌లోనే ఉండటం వల్ల ఎక్కువగా మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. త్వరగా రా డాడీ అంటూ ముద్దుగా అడిగేసింది. ఇక అలా ముద్దుగా, ప్రేమగా అడిగితే తండ్రి మనసు ఊరుకుంటుందా? వెంటనే రవి రిప్లై ఇచ్చారు. ఈ రోజు త్వరగానే ఇంటికి వస్తాను.. మిస్ యూ టూ అని రవి చెప్పేశాడు. మొత్తానికి ఈ తండ్రీ కూతుళ్ల ప్రేమకు అందరూ ఫిదా అవుతున్నారు.
ఇది కూడా చదవండి ==> నల్ల దుస్తుల్లో మెరిసిన నెరజాన.. యాంకర్ రష్మీ గౌతమ్ పిక్స్ వైరల్
ఇది కూడా చదవండి ==> యాంకర్ సుమ, అనసూయలని డామినేట్ చేస్తున్న రష్మీ గౌతం..
ఇది కూడా చదవండి ==> యాంకర్ ఓంకార్ పై బండ్ల గణేశ్ సీరియస్? ఇదేం టార్చర్.. అంటూ సిక్స్త్ సెన్స్ షోపై కామెంట్స్?
ఇది కూడా చదవండి ==> ఇమ్మాన్యుయేల్ కు జబర్దస్త్ వర్ష షాక్.. బుల్లెట్ భాస్కర్ తో రొమాన్స్.. రచ్చ రచ్చ చేశారు..!