rashmi gautam : యాంకర్ సుమ, అనసూయలని డామినేట్ చేస్తున్న రష్మీ గౌతం..
rashmi gautam : బుల్లితెర మీద ఒకప్పుడు సీరియల్స్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. రానురాను వాటిని మించి ఎంటర్‌టైన్మెంట్ రియాలిటీ షోస్, గేమ్ షోలకు బాగా ఆదరణ దక్కుతోంది. దాదాపు పదేళ్ళకి పైగానే ఢీ డాన్స్ షో సీరీస్ సాగుతోంది. ఈ షోకి చాలా క్రేజ్ ఉంది. అలాగే ఎనిమిదేళ్ల నుంచి జబర్దస్త్ సిరీస్ కూడా నాన్ స్టాప్ ఫన్ తో ఆకట్టుకుంది సీరియల్స్ కి మించి టాప్ రేటింగ్ ని సాధిస్తున్నాయి. తాజాగా టెలివిజన్ రేటింగ్స్ వెల్లడయ్యాయి. ప్రస్తుత సంవత్సరంలోని 26వ వారంలో నమోదైన టీఆర్పీ గణాంకాల్లో ఎప్పటిలాగానే జబర్దస్త్, ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్ అద్భుతమైన రేటింగ్‌తో దూసుకెళ్తున్నాయి. ఇటీవల ప్రసారమైన వారానికి సంబంధించి వివిధ షోలకు సంబంధించిన రేటింగ్స్ ఇలా ఉన్నాయి.
జీటీవీలో చిన్న పిల్లల కార్యక్రమం డ్రామా జూనియర్స్ ప్రసారమవుతోంది. జీ టీవీ తెలుగు ఛానెల్ లో అత్యధికంగా డ్రామా జూనియర్స్ టీఆర్పీని సొంతం చేసుకొంది. 26వ వారంలో డ్రామా జూనియర్స్ అర్బన్ ఏరియాలో 4.21, రూరల్ ఏరియాలో 4.43 రేటింగ్ రాబట్టింది. అలాగే బతుకు జట్కా బండి ఒరిజినల్ అర్బన్ ప్రాంతంలో 2.07, రూరల్‌లో 2.36 రేటింగ్ నమోదు అయింది. కాగా నాన్ సీరియల్ షోలు చెప్పుకోదగ్గ రేటింగ్‌ను రాబట్టలేకపోయాయి.
rashmi gautam : సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న స్టార్ మ్యూజిక్ అత్యధిక రేటింగ్‌ను రాబట్టింది.
ఇక మరో ప్రముఖ ఛానల్ స్టార్ మాలో స్టార్ మ్యూజిక్, స్టార్ మా తెలుగు ఛానెల్స్ చూస్తే.. సీరియల్ విభాగంలో టాప్ 5 సీరియల్స్‌ను తన ఖాతాలో వేసుకొన్న ఈ ఛానెల్ నాన్ సీరియల్ విభాగంలో సత్తా చాటలేకపోయింది. ఇందుల్లో సీనియర్ యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న స్టార్ మ్యూజిక్ అత్యధిక రేటింగ్‌ను రాబట్టింది. ఈ షో అర్బన్ ప్రాంతంలో 5.31, రూరల్‌లో 6.51 రేటింగ్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత స్థానంలో నిర్మాత, దర్శకుడు ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సిక్త్స్ సెన్స్‌కు అర్బన్‌లో 4.54, రూరల్‌లో 6.21 రేటింగ్ రాబట్టింది. ఆ తర్వాత కామెడీ స్టార్స్ షో 3.71 అర్బన్‌లో, 4.56 రూరల్‌లో నమోదు అయ్యాయి.
ఇక మరో ప్రముఖ యాంకర్ కం నటి అనసూయను మించి రష్మీ గౌతమ్ దూసుకుపోతోంది. ఈటీవీ తెలుగు ఛానెల్స్ లో అత్యధికంగా మల్లెమాల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ టాప్ రేటింగ్‌ను సాధించింది. 26వ వారంలో ఈ షో అర్బన్ ఏరియాలో 6.83, రూరల్ ఏరియాలో 9.47 రేటింగ్ దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో జబర్దస్త్, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.. అర్బన్‌లో 5.99 రేటింగ్, రూరల్‌లో 8.62 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్, శ్రీదేవి డ్రామా కంపెనీ నాలుగో స్థానంలో నిలిచాయి.
rashmi gautam : ఛానెల్స్‌లో అత్యధిక టీఆర్పీని నమోదు చేసిన ఛానెల్స్ స్టార్ మా.
అలాగే ఎక్స్‌ట్రా జబర్దస్త్ మొదటి స్థానంలో, జబర్దస్త్ రెండోస్థానంలో ఢీ 13 మూడో స్థానంలో, స్టార్ట్ మ్యూజిక్ నాలుగో స్థానంలో, శ్రీదేవి డ్రామా కంపెనీ ఐదో స్థానంలో నిలిచాయి. మిగితా షోలు ఓ మాదిరి రేటింగ్ తో సాగుతున్నాయి. ఇక ఛానెల్స్‌లో అత్యధిక టీఆర్పీని నమోదు చేసిన ఛానెల్స్ స్టార్ మా. అత్యధికంగా 949 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. జీ తెలుగు ఛానెల్స్ 758తో రెండోస్థానం, ఈ టీవీ తెలుగు 579, జెమినీ తెలుగు 415 రేటింగ్‌తో నాలుగోస్థానంలో నిలిచాయి. స్టార్ మా ను కార్తీక దీపం, ఇతర సీరియల్స్, అలాగే స్టార్ మ్యూజిక్ లాంటివి అగ్రస్థానంలో నిలిచేలా చేశాయి.
ఇది కూడా చదవండి ==> ఇమ్మాన్యుయేల్ కు జబర్దస్త్ వర్ష షాక్.. బుల్లెట్ భాస్కర్ తో రొమాన్స్.. రచ్చ రచ్చ చేశారు..!
ఇది కూడా చదవండి ==> కమిట్‌మెంట్ అడిగిన స్టార్ హీరో.. రిటన్‌లో బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖుష్బూ
ఇది కూడా చదవండి ==> విష్ణు ప్రియకి ఆ హీరో భర్తగా కావాలట.. ఆ హీరో ఎవరో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యాణ్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ..?