Bala Krishna : మళ్లీ బాలకృష్ణకు సర్జరీనా, ఏం జరిగింది?
Bala Krishna : నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాదు హోస్ట్‌గా అదరగొడతాడనే విషయం అన్‌స్టాపుబల్ షోతో అందరికి అర్ధమయ్యే ఉంటుంది. ఈ షోతో బాలకృష్ణ దుమ్ము రేపాడు. పసందైన వినోదం పంచుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. మరోవైపు బాలకృష్ణ. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే బాలకృష్ణకు మరోసారి శస్త్ర చికిత్స జరిగింది. గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు సర్జరీ చేశారు.
ఇది మైనర్ సర్జరీనేనని, బాలయ్య ఆరోగ్యం బాగుందని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కొద్ది రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే సరిపోద్దని సూచించారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో వైద్యులతో బాలకృష్ణ దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో బాలయ్య త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సర్జరీ వల్ల గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ‘అఖండ’ సినిమా చిత్రీకరణలో జరిగిన ఓ ప్రమాదంలో బాలకృష్ణ కుడిభుజానికి గాయకావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ వైద్యులు శస్ర్త చికిత్స చేసిన విషయం తెలిసిందే.

Bala Krishna undergoes another knee surgery
Bala Krishna : ఆల్ ఈజ్ వెల్
ఇక చివరిగా బాలకృష్ణ అఖండ సినిమాతో పలకరించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ గత 11 ఏళ్లలో 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చింది ఈ కాంబినేషన్. అది కూడా బాలకృష్ణ వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. అందుకే ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే బాక్సాఫీస్ దద్దరిళ్లిపోతుంది. గతేడాది ఇద్దరూ కలిసి చేసిన అఖండ ఎలాంటి సంచలనం సృష్టించింది అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో కూడా 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది అఖండ. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని అంటున్నారు.