Balakrishna fans fire on Jr ntr
Jr Ntr : ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తో మొదలైన ఆ క్రేజ్ ఇప్పటికీ ఆయన వారసత్వం కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో నందమూరి ఫ్యామిలీ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిందే నిన్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు అందరు కూడా అతనికి ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కళ్యాణ్ రామ్ కూడా విషెస్ చేయడంతో పాటు భగవంత్ కేసరి టీజర్ గురించి మెన్షన్ చేశారు.
అయితే వీటన్నింటికి మధ్య ఒక జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యకి విషెస్ చెప్పలేదని బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చివరిగా 2020లో బాలకృష్ణ బర్త్ డే కి విషెస్ చెప్పారు. తర్వాత రెండేళ్ల నుంచి చెప్పడం లేదు. దీనిపై నందమూరి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తారక్ కి నందమూరి కుటుంబం మధ్య దూరం పెరుగుతుందని ప్రచారం వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ తారక్ ఒక వైపు మిగిలిన నందమూరి ఫ్యామిలీ అంతా ఓవైపు ఉన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకి తారక్ ని ఆహ్వానించారు. అయితే రాను అని చెప్పడం జరిగిందట. ఎన్టీఆర్ జయంతి రోజు నివాళి అర్పించేందుకు ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడ నందమూరి అభిమానులపై తారక్ కొంత సహనం వ్యక్తం చేశారు.
Balakrishna fans fire on Jr ntr
ఇప్పుడు బాలయ్య కి విషెస్ చెప్పకపోవడంతో బాలయ్యతో తారక్ కి ఏమైన విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్ తారక్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నందమూరి అనే ఇంటి పేరు అనే బ్రాండ్ లేకపోతే ఎన్టీఆర్ హీరో అయ్యేవాడు కాదంటు విమర్శలు చేస్తున్నారు. వంశం పేరు చెప్పుకుని ఎదిగి ఇప్పుడు కనీసం కృతజ్ఞత చూపించడం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ తారక్ కు సపోర్ట్ గా ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు ప్రోత్సహించలేదని తనకు తానే స్వయంకృషితో ఎదిగాడని ఈరోజు అతను సాధించిన ఇమేజ్ కేవలం తారక్ కష్టమే అంటూ చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్ మాత్రం నడుస్తుంది.
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
This website uses cookies.