BalaKrishna : ఓరినీ .. బాలయ్యతో కలిసి చిరంజీవికి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన అల్లు అరవింద్.. !
BalaKrishna : మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన తెలివితేటలని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ లకు పోటీగా ఆహా ఓటీటీని నిలబెట్టిన అల్లు అరవింద్ ఈ ఓటీటీలో ఎవర్గ్రీన్ షోలతో తన టాలెంట్ చూపిస్తున్నారు. అసలు బాలకృష్ణతో అన్ స్టాపబుల్ షో కాన్సెప్టే అదుర్స్ అనిపించింది. అందుకే అన్ స్టాపబుల్ షో ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుంది. ప్రస్తుతం సీజన్ 2 జరుగుతుండగా ఈ సీజన్ కూడా ఆహాకి మంచి లాభాలే తెచ్చి పెట్టేలా ఉంది. ఇదిలాఉంటే అల్లు, నందమూరి ఫ్యామిలీల మధ్య్హ ఏర్పడ్డ ఈ రిలేషన్ ని మరింత ముందుకు తీసుకెళ్లెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్ స్టాపబుల్ లో అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో పనిచేస్తున్న బాలకృష్ణతో ఈసారి షో కాదు సినిమానే తీయాలని ఫిక్స్ అయ్యారట. ఆలోచన రావడమే ఆలస్యం బాలయ్యతో చెప్పగా ఓయెస్ అనేశారట. గీతా ఆర్ట్స్ లో బాలకృష్ణ హీరోగా సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాకు డైరక్టర్ గా పరశురాం పెట్ల పేరు వినిపిస్తుంది. సర్కారు వారి పాట సినిమాతో సత్తా చాటిన పరశురాం తన నెక్స్ట్ సినిమా నాగ చైతన్యతో కానీ, విజయ్ దేవరకొండతో కానీ చేస్తాడని టాక్. గీతా గోవిందంతో గీతా ఆర్ట్స్ లో సూపర్ హిట్ కొట్టిన పరశురాం ఈ బ్యానర్ లో ఓ క్రేజీ కాంబో సెట్ చేస్తున్నారట. గీతా ఆర్ట్స్ లో బాలయ్య కంబో అంటే ఆ లెక్కలు వేరేలా ఉంటాయి.

balakrishna geetha arts movie allu aravind mega plan
రీ ఎంట్రీ తర్వాత చిరంజీవితో సినిమా చేయాలని అల్లు అరవింద్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఎంత ప్రయత్నించినా సొంత బ్యానర్ లో తప్ప గీతా ఆర్ట్స్ కి ఛాన్స్ ఇవ్వట్లేదు చిరంజీవి. అందుకే ఆ కసి మీదే బాలయ్యతో సినిమా ప్లాన్ చేస్తున్నరని చెప్పుకుంటున్నారు. మరి బావ గారి మీద కోపంతో బాలయ్య తో సినిమా చేస్తున్నాడా లేక నిజంగానే బాలకృష్ణతో సినిమా చేయాలని అల్లు అరవింద్ అనుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బాలకృష్ణ, అల్లు అరవింద్ కాంబినేషన్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. షో సక్సెస్ అయినట్టుగానే ఈ కాంబో సినిమా కూడా సూపర్ హిట్ కావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.