Balakrishna Vs Venkatesh : ఒకే రోజు ఒకే కథతో పోటీ పడ్డ వెంకటేష్, బాలకృష్ణ.. ఏది హిట్, ఏది ఫట్
Balakrishna Vs Venkatesh : టాలీవుడ్ సీనియర్ హీరోలు ఒకప్పుడు విచిత్రమైన ప్రయోగాలు చేశారు. వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున ఇలా పలువురు స్టార్స్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించారు. ఇక వీరు ఒకే రోజు పోటీ పడడం కూడా జరిగింది. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలతో ఒకేరోజున పోటీపడిన సందర్బాలు కోకొల్లలు.. కానీ ఒకే కథతో ఉన్న రెండు సినిమాలు ఒకేరోజున విడుదల చేయడం అనేది చాలా తక్కువ. అయితే 1989లో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. 1989లో ముద్దుల మావయ్య సినిమాతో హిట్ కొట్టి ఇండస్ట్రీని షేక్ చేసిన బాలకృష్ణ తన తదుపరి చిత్రంగా అశోక చక్రవర్తి అనే సినిమాని చేశారు.
ఇందులో బాలకృష్ణ సరసన భానుప్రియ కథానాయికగా నటించింది. ఈ చిత్రం మలయాళంలో హిట్టైన ఆర్యన్ సినిమాకి రీమేక్‌గా రూపొందింది.. ఇక ఒంటరి పోరాటం సినిమాతో మంచి హిట్ కొట్టిన వెంకటేష్.. ఆ తర్వాత ధృవనక్షత్రం అనే సినిమాతో పలకరించాడు .యాదృచ్చికంగా ఈ రెండు సినిమాలు ఒకే రోజున అంటే 29 జూన్ 1989న విడుదలయ్యాయి. అయితే ఇందులో అశోక చక్రవర్తి చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. ఇక అదేరోజు విడుదలైన ధ్రువ నక్షత్రం చిత్రం మాత్రం మాత్రం సూపర్ హిట్ అయింది. ఇక్కడో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలకి పరిచురి బ్రదర్స్ రచయితలుగా వ్యవహరించారు.
Balakrishna Vs Venkatesh : ఒకే కథతో..
వెంకటేష్ హీరోగా ‘ధ్రువనక్షత్రం’ చిత్రం దాదాపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కగా, ఈ చిత్రానికి వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా దాదాపు మలయాళ సూపర్ హిట్ ‘ఆర్యన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమాను కూడా 1989 జూన్ 29న విడుదల చేశారు. అయితే ఈ చిత్రం మంచి విజయం సాధించి, బాలయ్య చిత్రం ఫ్లాప్ కావడం అందరిని ఆశ్చర్యపరచింది. ‘అశోక చక్రవర్తి’ మూవీతోబాలీవుడ్ నటుడు శరత్ సక్సేనా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.