Chiranjeevi : లీక్ అయిన బాలయ్య – అనిల్ రావిపూడి స్టోరీ .. చిరంజీవికి చెమటలు పట్టే కథ ఇది ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : లీక్ అయిన బాలయ్య – అనిల్ రావిపూడి స్టోరీ .. చిరంజీవికి చెమటలు పట్టే కథ ఇది ..?

 Authored By prabhas | The Telugu News | Updated on :5 December 2022,5:40 pm

Chiranjeevi : నటసింహం బాలయ్య ఈమధ్యనే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నాడు. మొదటిసారిగా 100 కోట్ల క్లబ్ లో చేరాడు. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్స్ లో భారీ వసూళ్లూ రాబట్టింది. ఒకప్పటి బలయ్యను గుర్తుచేసేలా ఉంది. బాలయ్య ఒకవైపు హీరోగా మరోవైపు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆహా లో హోస్ట్ గా ప్రసారం అవుతున్న అన్ స్టాప్ అబుల్ షో మంచి సక్సెస్ తో దూసుకెళుతోంది. ఇక సినిమాలో పరంగా సంక్రాంతికి వీరసింహారెడ్డి గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాలో గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ అదిరిపోయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి తో మరో సినిమా చేయనున్నారు. బాలయ్య 108వ సినిమాగా ఇది తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ వార్త టాలీవుడ్లో బాగా వైరల్ అవుతుంది. ఇక ఆ స్టోరీ ఏంటంటే హీరో వయసులో ఉన్నప్పుడు నేరం చేసి జైలుకి వెళతాడు.ఆయన చేసిన నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.

Balayya Anil Ravipudi movie story leak on Chiranjeevi Happy

Balayya Anil Ravipudi movie story leak on Chiranjeevi Happy

దీంతో 14 ఏళ్లు జైలలో ఉంటాడు. జైలు నుండి వచ్చాక హీరో వయసు 50 ఏళ్లు దాటుతుంది. అసలు హీరో చేసిన నేరం ఏంటి మధ్య వయసులో జైలు నుంచి బయటికి వచ్చిన హీరో ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా కథ అంటున్నారు. ఈ స్టోరీని చూస్తే గతంలో బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా గుర్తుకొస్తుంది. సినిమాలో ఫ్యాక్షనిస్ట్ బాలయ్య శత్రువుల కుట్రకు బలై 20 ఏళ్లకు పైగా తీహార్ జైల్లో ఉంటాడు. బయటకు వచ్చాక తన ఫ్యామిలీని నాశనం చేసిన వారిపై పగ తీర్చుకుంటారు. మరి ఈ కథ నిజమో కాదు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది