Pawan Kalyan : ఆ ముగ్గురికి ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ దేవుడు, రాజకీయాల్లో రాక్షసుడా?
Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ను దేవుడు.. రాముడు అంటూ పొగుడుతున్న వారు రాజకీయాల్లోకి వచ్చేప్పటికి కనీసం ఓట్లు కూడా వేయడం లేదు. ఓటర్ల విషయం పక్కన పెడితే కనీసం సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా పవన్ కళ్యాన్ కు మద్దతుగా నిలవడం లేదు. సరే ఆయనకి అందరు సినిమా ఇండస్ట్రీ వారు మద్దతు చెప్పకున్నా పర్వాలేదు. కనీసం ఆయన అంటే వీరాభిమానం మాటల్లో చూపించే నితిన్.. బండ్ల గణేష్ మరియు ఆలీ లు కూడా ఆయన జనసేన పార్టీకి మద్దతుగా నిలిచిన దాఖలాలు లేవు. వారు ముగ్గురు పవన్ ని వాడుకుంటున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.
బండ్ల గణేష్ ఈ స్థితిలో.. ఈ స్థాయిలో ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ దయవల్లే. ఆ విషయాన్ని స్వయంగా బండ్ల బాబు కొన్ని వందల సార్లు అన్నాడు. అయినా కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చేప్పటికి కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచాడు. ఆయన ఎప్పుడు కూడా జనసేన పార్టీకి జై కొట్టిన దాఖలాలు లేవు. ఇక అలీ అంటే పవన్ కి ఎంత అభిమానమో అందరికి తెల్సిందే. తన సినిమాలో ఒకానొక సమయంలో ఆలీ తప్పనిసరిగా ఉండాల్సిందే అని పవన్ బలంగా కోరుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి అలీ కూడా జనసేనకు బద్ద శత్రువు అయిన వైకాపాలో జాయిన్ అయ్యాడు కానీ జనసేనకు మాత్రం మద్దతు తెలపలేదు.
ఇక చివరగా నితిన్ తనకు పవన్ అంటే పిచ్చి అభిమానం. ఆయన కోసం కోసుకుంటా అంటూ స్టేజీల మీద తెగ స్పీచ్ లు ఇచ్చి తన సినీ కెరీర్ కు చాలా వాడుకున్నాడు. కానీ ఇప్పుడు వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసి శాలువ కప్పుకున్నాడు. ఇదెక్కడి విడ్డూరం అంటే ఆయన నుండి సమాధానం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ ను చాలానే వాడుకున్నారు. కానీ రాజకీయాల్లోకి వచ్చేప్పటికి మాత్రం వారికి పవన్ ఒక రాక్షసుడిగా కనిపిస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ ముగ్గురిని పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త దృష్టిలో పెట్టుకోవాలంటూ కొందరు సూచిస్తున్నారు.