Home » Entertainment » Bandla Ganesh And Anchor Ohmkar In Sixth Sense Show
Entertainment

Ohmkar : యాంకర్ ఓంకార్ పై బండ్ల గణేశ్ సీరియస్? ఇదేం టార్చర్.. అంటూ సిక్స్త్ సెన్స్ షోపై కామెంట్స్?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: July 9, 2021 2:06 pm
Advertisement

Ohmkar : యాంకర్ ఓంకార్ గురించి తెలుసు కదా. తెలుగు బుల్లితెర చరిత్రలోనే యాంకర్ గా సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు ఓంకార్. అందుకే ఆయనకు అంత పేరు వచ్చింది. యాంకర్ ఓంకార్ అంటే ఒక బ్రాండ్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలుగు బుల్లితెర మీద యాంకర్ గా కొనసాగుతూ… తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు ఓంకార్. ఆయన హోస్ట్ చేసే షోలు అయితే చాలా వెరైటీగా ఉంటాయి. టెన్షన్ పెట్టిస్తాయి. ముఖ్యంగా ఓంకార్ ఎక్కడ ఉంటే అక్కడ టెన్షన్ అన్నట్టే. అందుకే.. ఓంకార్ షో అంటేనే చాలా మంది భయపడతారు. కొందరు మాత్రం ఓంకార్ షో ను చాలెంజింగ్ గా తీసుకొని ఆయన షోలో పార్టిసిపేట్ చేస్తుంటారు.

Advertisement

bandla ganesh and anchor ohmkar in sixth sense show

ఓంకార్ ప్రస్తుతం స్టార్ మాలో రెండు మూడు షోలను హోస్ట్ చేస్తున్నారు. ఒకటి డ్యాన్స్ ప్లస్ కాగా.. మరొకటి సిక్స్త్ సెన్స్ షో. సిక్స్త్ సెన్స్ షో మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంటుంది. ఈ షో ప్రస్తుతం సూపర్ సక్సెస్ అయి 4 వ సీజన్ లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో సిక్స్త్ సెన్స్ షోలో గేమ్ ఆడించారు ఓంకార్. తాజాగా ఈ షోకు ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ వచ్చారు.

Advertisement

bandla ganesh and anchor ohmkar in sixth sense show

Ohmkar : వన్ సెకండ్ అంటూ ఓంకార్ అనడంతో వెంటనే సీరియస్ అయిన బండ్ల గణేశ్

ఓంకార్ షో అంటేనే దాంట్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని అందరికీ తెలుసు కదా. తాజాగా ఓంకార్ షోకు వచ్చిన బండ్ల గణేశ్ తో ఓంకార్ ఓ ఆట ఆడుకుందామనుకున్నాడు కాబోలు. ఆయన ఆడే ప్రతి గేమ్ లో వన్ సెకండ్.. వన్ సెకండ్ అంటూ తెగ టెన్షన్ పెట్టిచ్చాడు.

Advertisement

bandla ganesh and anchor ohmkar in sixth sense show

ఏందయ్యా ఇది.. కొట్టుకోమంటావా? ఇదెక్కడి టార్చర్. నా గుండె దడదడా కొట్టేసుకుంటోంది. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి.. అంటూ వాటర్ తాగిన బండ్ల గణేశ్.. నాతో ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరూ మంచి నీళ్లు తాగించలేదు కానీ… నువ్వు తాగించావు.. అంటూ ఒక్కసారిగా సీరియస్ అవ్వడంతో యాంకర్ ఓంకార్ కు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇమ్మాన్యుయేల్ కు జబర్దస్త్ వర్ష షాక్.. బుల్లెట్ భాస్కర్ తో రొమాన్స్.. రచ్చ రచ్చ చేశారు..!

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> యాంక‌ర్‌ సుమ, అనసూయలని డామినేట్ చేస్తున్న రష్మీ గౌతం..

ఇది కూడా చ‌ద‌వండి ==> కమిట్‌మెంట్ అడిగిన స్టార్‌ హీరో.. రిటన్‌లో బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖుష్బూ

ఇది కూడా చ‌ద‌వండి ==>  విష్ణు ప్రియకి ఆ హీరో భర్తగా కావాలట.. ఆ హీరో ఎవరో తెలుసా..?

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి