Khushbu : కమిట్‌మెంట్ అడిగిన స్టార్ హీరో.. రిటన్‌లో బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖుష్బూ
Khushbu : టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా పలు సౌత్ భాషలలో గత కొంతకాలంగా వినిపిస్తున్న మాట కమిట్‌మెంట్, కాస్టింగ్ కౌచ్. ఇక్కడ అఫీషియల్‌గా వినిపించే ఈ కమిట్‌మెంట్ అనే పదానికి అసలు అర్థం వేరే ఉంది. ఒక హీరోయిన్ సినిమాలో అవకాశం పొందాలంటే దర్శకులకు, నిర్మాతలకు, హీరోలకి, వాళ్ళ సన్నిహితులకి కమిట్‌మెంట్ ఇవ్వాలి. అంటే వారితో ప్రైవేటుగా కలవాలని డిమాండ్ ఉంటుంది. ఈ విషయంలో గడిచిన మూడు నాలుగేళ్ళలో ఎంతో మంది ఫీమేల్ ఆర్టిస్టులు, సింగర్లు, హీరోయిన్లు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతున్నారు. కొంతమంది అబ్బే అలాంటిదేమీ లేదంటుంటే, కొంతమంది మాత్రం అది ఇస్తేనే అవకాశం ఇస్తారని వాపోతున్నారు.
ఇటీవల ఓ స్టార్ హీరోయిన్ కూడా ఈ విషయంలో తనకి జరిగిన ఓ సంఘటనని బయట పెట్టారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ఖుష్బూ. తమిళ సినిమాలలో మంచి పాపులారిటీ తెచ్చుకుని, అక్కడ అభిమానులతో గుడి కట్టించుకున్న ఈ సీనియర్ హీరోయిన్ కు డెబ్యూ మూవీ మాత్రం తెలుగులో చేసింది.1986లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మొదటి సినిమా కలియుగ పాండవులు. ఈ సినిమాతో ఖుష్బూ హీరోయిన్‌గా తెలుగు తెరకు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయింది.
Khushbu : ప్రస్తుతం ఈమె రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తేలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.
ఆ తర్వాత చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజేంద్రప్రసాద్.. లాంటి స్టార్ హీరోలకి జంటగా నటించి క్రేజీ హీరోయిన్‌గా మారింది. అయితే తెలుగులో ఖుష్బూ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి, ఈమె ఇక్కడ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. కాగా తెలుగులో ఓ ప్రముఖ హీరోతో నటిస్తున్నపుడు ఆయన కమిట్‌మెంట్ అడిగాడని ఖుష్బూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అయితే, ఆ హీరో చెల్లెలిని తన తమ్ముడి గదిలోకి పంపిస్తే తాను కమిట్‌మెంట్ ఇస్తానని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చానని ఖుష్బూ తెలిపింది. అప్పటి నుంచి ఆ సీనియర్ హీరోకు తనకు మాటలు లేవని పేర్కొనింది. తెలుగులో ఖుష్బూ చాలా తక్కువ మంది హీరోలతోనే నటించింది. మరి వీరిలో ఖుష్బూని కమిట్‌మెంట్ అడిగిన హీరో ఎవరనేది వెల్లడించలేదు. ప్రస్తుతం ఈమె రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తేలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.
ఇది కూడా చదవండి ==> విష్ణు ప్రియకి ఆ హీరో భర్తగా కావాలట.. ఆ హీరో ఎవరో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యాణ్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ..?
ఇది కూడా చదవండి ==> అన్నదమ్ములు రాజమౌళికి SS.. కీరవాణికి MM.. అని ఎందుకు ఉంటాయో మీకు తెలుసా…?
ఇది కూడా చదవండి ==> అయిపాయె.. యాంకర్ ప్రదీప్ కు ఐలవ్యూ చెప్పేసిన శ్రీముఖి? షాక్ లో అభిమానులు..!