Bandla Ganesh : మాస్ కా బాప్.. ‘వకీల్ సాబ్’పై బండ్ల గణేష్ కామెంట్స్
Bandla Ganesh : వకీల్ సాబ్ సినిమా ఇప్పుడు ఓ ప్రభంజనం.. పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్‌తో ఇప్పుడు సోషల్ మీడియా ఊగిపోతోంది. అలాంటి సమయంలో బండ్ల గణేష్ ట్వీట్ వేస్తే ఎలా ఉంటుంది..
ఆయన మాట్లాడితే చాలు అదో సెన్సేషన్. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్లన్న మాట్లాడిన మాటలు, ఇచ్చిన స్పీచ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. వకీల్ సాబ్ ఈవెంట్ మొత్తానికి బండ్లన్న ఇచ్చిన స్పీచే హైలెట్ అయింది.

Bandla Ganesh on Pawan kalyan Vakeel saab
అలా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే మాటలు, ఆ పొగడ్తలు ఎప్పుడూ కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక నేటి ఉదయం నుంచి వకీల్ సాబ్ మీద వస్తున్న ట్వీట్లు.. బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు పెడుతున్న ట్వీట్ల గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు వకీల్ సాబ్ మీద ట్వీట్లు వేయడం సెలెబ్రిటీల వంతైంది. తాజాగా బండ్ల గణేష్ వకీల్ సాబ్ గురించి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Bandla Ganesh : మాస్ కా బాప్.. ‘వకీల్ సాబ్’పై బండ్ల గణేష్ కామెంట్స్ :
మాస్ కా బాస్ వకీల్ సాబ్.. మాటల్లేవ్.. వాదనల్లేవ్.. కేవలం తీర్పు మాత్రమే.. అది కూడా బ్లాక్ బస్టర్.. జై పవర్ స్టార్ అంటూ ట్వీట్ వేశాడు. తమన్ నువ్ వకీల్ సాబ్ కోసం ప్రాణం పెట్టి చేశావ్.. అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నాడు. ఇక పవన్ కళ్యాణ్‌పైనే కాకుండా.. స్పెషల్‌గా తమన్ ఇచ్చిన సంగీతం, ఆయన పడ్డ కష్టం గురించి కూడా బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు. బండ్లన్న వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.