Bandla ganesh: పవన్ కళ్యాణ్ నా దేవుడు..కానీ జనసేన పార్టీలో చేరకపోవడానికి కారణం అదే..వాస్తవాలు బయటపెట్టిన బండ్ల గణేశ్
Bandla ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేను పవన్ కళ్యాణ్ భక్తుడిని. ఆయన నా గాడ్ అంటూ ఎక్కడ సమయం దొరికినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేసి హాట్ టాపిక్ అవుతుంటాడు. ఇంత ప్రేమ, అభిమానం ఉన్న బండ్ల గణేశ్ ఆయన గాడ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెడితే మాత్రం అందులో జాయిన్ అవలేదు. అప్పట్లో ఇదొక పెద్ద హాట్ టాపిక్ అయింది. ఎన్నిసార్లు బండ్ల గణేశ్‌ని ఈ విషయం అడిగినా సినిమాలు వేరు రాజకీయాలు వేరంటూ దాటేస్తూ వచ్చారు.

bandla-ganesh says he worships pawan kalyan
అయితే తాజాగా దీనిపై బండ్ల గణేశ్ క్లారిటీ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేశ్ తాజాగా విడుదలైన ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో ఓ పాత్రలో నటించారు. అయితే సినిమాలతో పాటు ప్రస్తుత, రాజకీయం సామాజిక అంశాలపై అప్పడప్పుడు ట్విట్టర్‌లో స్పందిస్తూ కాంట్రవర్సీ అవుతూ ఉంటాడు బండ్ల గణేశ్. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటకి కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో, పవన్ కళ్యాణ్‌ను అంతగా ఆరాధించే బండ్ల గణేష్ జనసేన పార్టీలో ఎందుకు చేరలేదు? చేరకపోవటం వెనక ఏమైన కారణాలు ఉన్నాయా? అంటూ రక రకాల సందేహాలు వ్యక్తమయ్యాయి.
Bandla ganesh: ఆయనపై ఉన్న నమ్మకంతోనే మా ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.
తాజాగా వీటికి క్లారిటీ ఇచ్చారు బండ్ల గణేష్. చిన్నప్పటి నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానం. మా ఫ్యామిలీ అంతా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు. ఆ కారణంగానే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే నాకు కృతజ్ఞతా భావమని, అలాగే ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ తనకు స్నేహితుడులాంటివాడు మాత్రమేనని తెలిపారు. అయితే, ఆయన వెంట తిరిగినందుకు అందరూ ఆయన బినామి అంటూ రాసేశారని అన్నారు. ఇక ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ గురించి స్పందించిన బండ్ల గణేష్.. ఆయనపై ఉన్న నమ్మకంతోనే మా ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.