కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకి చేరుకుంది. దాంతో నాగార్జున డిసెంబర్ నుంచి సినిమాలని మొదలు పెట్టబోతున్నాడని సమాచారం. 2021 వరసగా సినిమాలు చేయడమే కాదు కనీసం 3 సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారటా నాగ్. ఈ క్రమంలోనే ముందు బంగార్రాజు సినిమాని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడట. ఇప్పటి వరకు నాగార్జున నటించిన సూపర్ హిట్స్ లో ‘సోగ్గాడే చిన్నినాయన’ టాప్ టెన్ లో ఉంటుందనడం లో సందేహం లేదు.
‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకు అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు కామన్ ఆడియన్స్ కూడా ఈ పాత్రని బాగా ఎంజాయ్ చేశారు. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ – నాగార్జున ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని డిసైడయిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా ఎప్పటికప్పుడు అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఎట్టకేలకి డిసెంబర్ మూడో వారం నుండి ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు లేటెస్ట్ న్యూస్. అంతేకాదు మరో సర్‌ప్రైజ్ న్యూస్ కూడా వినిపిస్తోంది.
ఈ సినిమాలో నాగార్జున .. నాగ చైతన్య లతో పాటు అక్కినేని అఖిల్ కనిపించబోతున్నాడని సమాచారం. అంతేకాదు మనం సినిమా మాదిరిగా తెరకెక్కించాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సిద్దం చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. కాగా ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్ లో బిజీగా ఉన్నాడట.
ఇక నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ.. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతున్నాయి. ఆ తర్వాత చైతూ విక్రం కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అన్న సినిమా చేయబోతుండగా దిల్ రాజు నిర్మించబోతున్నాడు. అలాగే అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన 5 వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
This website uses cookies.