దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఈ పోరాట యోధుల టీజర్స్ వచ్చి సినిమా మీద భారీ అంచనాలను పెంచేశాయి. యావత్ భారత్ దేశం ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా ఈ భారీ మల్టీస్టారర్ నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. 50 రోజుల మేజర్ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసి.. వెంటనే కొత్త షెడ్యూల్ కోసం చిత్రబృందం రెడీ అవుతున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడంతో రాజమౌళి ప్రపంచస్థాయి నటీనటుల్ని ఎంచుకున్నాడు. ఈ కారణంగానే ఎన్టీఆర్ కి జంటగా బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ ని తీసుకున్నారు.
ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద కీరవాణి వర్క్ చేస్తున్నారని సమాచారం. బాహుబలి సినిమా సక్సస్ కి కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. కాగా ఇప్పటివరకూ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేసుకున్న సీన్స్ కు సంబంధించి ఇప్పటికే మెయిన్ బిజియమ్ ను కీరవాణి పూర్తి చేశాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
రాజమౌళి బాహుబలి సినిమాని మించి భారీ సక్సస్ ఇవ్వాలని ఏమాత్రం కామ్రమైజ్ కావడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ – ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్స్ గా మారబోతున్నారని ఇప్పటికే ఒకవైపు నందమూరి అభిమానులు మరొక వైపు మెగా అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ చూసిన ప్రతీ ఒక్కరు కొన్నాళ్ళ పాటు మైండ్ లో మరే సినిమా గుర్తు రాదని చెప్పుకుంటున్నారు.
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
This website uses cookies.