మరో మనం సినిమాగా బంగార్రాజు .. నాగ్, చైతు లతో పాటు అఖిల్ కూడా ..?

0
Advertisement

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకి చేరుకుంది. దాంతో నాగార్జున డిసెంబర్ నుంచి సినిమాలని మొదలు పెట్టబోతున్నాడని సమాచారం. 2021 వరసగా సినిమాలు చేయడమే కాదు కనీసం 3 సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారటా నాగ్. ఈ క్రమంలోనే ముందు బంగార్రాజు సినిమాని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడట. ఇప్పటి వరకు నాగార్జున నటించిన సూపర్ హిట్స్ లో ‘సోగ్గాడే చిన్నినాయన’ టాప్ టెన్ లో ఉంటుందనడం లో సందేహం లేదు.

Soggade Chinni Nayana Telugu Movie Review, Nagarjuna, Ramya Krish

‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకు అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు కామన్ ఆడియన్స్ కూడా ఈ పాత్రని బాగా ఎంజాయ్ చేశారు. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ – నాగార్జున ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని డిసైడయిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా ఎప్పటికప్పుడు అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఎట్టకేలకి డిసెంబర్ మూడో వారం నుండి ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు లేటెస్ట్ న్యూస్. అంతేకాదు మరో సర్‌ప్రైజ్ న్యూస్ కూడా వినిపిస్తోంది.

Love Story: Naga Chaitanya and Sai Pallavi are all Mushy and Romantic in this First Look Poster (View Pic) | 🎥 LatestLY

ఈ సినిమాలో నాగార్జున .. నాగ చైతన్య లతో పాటు అక్కినేని అఖిల్ కనిపించబోతున్నాడని సమాచారం. అంతేకాదు మనం సినిమా మాదిరిగా తెరకెక్కించాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సిద్దం చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. కాగా ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నాడట.

Most Eligible Bachelor new poster out: Pooja Hegde teases Akhil Akkineni - Movies News

ఇక నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ.. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతున్నాయి. ఆ తర్వాత చైతూ విక్రం కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అన్న సినిమా చేయబోతుండగా దిల్ రాజు నిర్మించబోతున్నాడు. అలాగే అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన 5 వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement