Bangarraju Movie Trailer released
Bangarraju Movie Trailer : అక్కినేని నాగార్జున ఆయన తనయుడు నాగ చైతన్య నటించిన తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఈ సంక్రాంతికి థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. కరోనా కారణంగా భారీ బడ్జెట్ సినిమాలు వాయిదాపడ్డా కూడా ధైర్యం చేసి బరిలోకి దిగుతున్నాడు బంగార్రాజు. జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.కొద్ది సేపటి క్రితం చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా చైతూ, నాగ్ మధ్య సన్నివేశాలు అభిమానులకి కనుల పండుగగా ఉన్నాయి. ఇటీవలే సెన్సార్ పూర్తి చేస్తున్న బంగార్రాజు సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో బంగార్రాజు బావగారు చూపులతో ఊచకోత కోసేస్తారు.. మాట్లాడుకోవడానికి అయితే అమ్మాయిని, కొట్టేస్టుకోడానికి అయితే అబ్బాయిని తీసుకురమ్మని చెప్పావట కదరా అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. చైతూ గతంలో ఎప్పుడు కనిపించని మాస్ లుక్‌లో కనిపించారు. ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలే పెంచింది.ఈ సినిమాకు ఊహించని ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ జరగొచ్చని అంతా భావించారు.
Bangarraju Movie Trailer released
కానీ దానికి ఇంకో 4 కోట్లు యాడ్ చేసుకొని 34 కోట్ల మేర రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్ లీడ్స్ కాగా ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. వీళ్లతో పాటు మీనాక్షి దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, దక్ష నాగార్కర్, సిమ్రత్ కౌర్ వంటి హీరోయిన్లు కూడా కనిపించనున్నట్లు తెలుస్తుంది. గతంలో నాగార్జున నటించిన కింగ్ సినిమాలోని ఒక పాటలో ఏకంగా ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ సందడి చేసిన సంగతి తెలిసిందే.
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.