Bangram fame shanthi : బంగారం అక్కను కూడా తీసుకొచ్చారుగా.. జబర్దస్త్‌లోనూ చీ పోరా ట్రెండ్

Authored By aruna | The Telugu News | Published on: September 10, 2022, 9:00 pm

Bangram fame shanthi : ప్రస్తుతం తెలుగువారికి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బంగారం. బంగారం అక్క ట్రోల్స్ మీద పెద్ద చర్చే జరుగుతోంది. ఆమె చెప్పిన డైలాగ్, పలికిన తీరు, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అన్నీ కూడా వైరల్అయ్యాయి. చివరకు ఆమె పేరు కూడా బంగారం అయింది. బంగారం అక్కా అని అందరూ మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. చీ పోరా అని అంటున్నారు. బంగారం ఒరిజినల్ పేరు శాంతి.

ఇప్పుడు ఆమె బంగారం శాంతిగానే ఫేమస్ అయింది. గత రెండు మూడు వారాలుగా బంగారం రీల్స్ ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం బంగారాన్ని ఫాలో అవుతున్నారు. ఆమె డైలాగ్ చెప్పేందుకు తహతహలాడుతున్నారు. ఆమె ఇంటర్వ్యూలు సైతం వైరల్ అవుతున్నాయి. ఇలా ట్రెండింగ్‌లో ఉన్న వారిని జబర్దస్త్ టీం ఎందుకు వదిలేస్తుంది.

Bangram fame shanthi in Jabardasth Latest Promo

ట్రెండింగ్‌లో ఉన్న వాళ్లను పట్టుకోవడంలో జబర్దస్త్ టీం ముందుంటుంది. ఇలానే బంగారం అక్కని కూడా పట్టుకున్నారు. జబర్దస్త్ స్టేజ్ మీద కూడా అవే డైలాగ్‌లు చెప్పింది. చలాకీ చంటి టీంలో ఆమె మెరిసింది. చలాకీ చంటిని చీ పోరా అంటూ అనేసింది. ఇక బంగారం అంటూ ఆమె చేసిన ఈ పర్ఫామెన్స్ చూసి అందరూ తెగ నవ్వేసుకున్నారు. చంటి ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాడు.

అంటే ఇది గత నెలలో ఎప్పుడో షూటింగ్ చేసినట్టు కనిపిస్తోంది. బంగారం అనే టాపిక్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయింది. బంగారం శాంతికి ఓవర్ నైట్ గుర్తింపు వచ్చింది. ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp