Yendira Ee Panchayithi : అక్టోబర్ 6న విలేజ్ లవ్ స్టోరీ ‘ఏందిరా ఈ పంచాయితీ’ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Yendira Ee Panchayithi : అక్టోబర్ 6న విలేజ్ లవ్ స్టోరీ ‘ఏందిరా ఈ పంచాయితీ’

 Authored By aruna | The Telugu News | Updated on :27 September 2023,1:00 pm

Yendira Ee Panchayithi గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న సినిమాలు, సహజత్వమైన కథలతో తెరకెక్కుతున్న చిత్రాలు జనాల ఆదరణను దక్కించుకుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఈ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ అంటూ ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది వరకు ఈ చిత్రం నుంచి విడుదలు చేసిన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంది. సునీత పాడిన పాట అయితే అందరినీ కదిలించింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మీద వచ్చిన ఆ పాట అందరినీ మెప్పించింది. ఇలా ప్రతీ విషయంలో సినిమా మీద ఆసక్తిని పెంచేలా ప్రమోషన్స్ చేసింది యూనిట్.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదిని ప్రకటించారు. అక్టోబర్ 6న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Bharat Vishika Laxman Yendira Ee Panchayithi Going To Release On October 6th

Bharat Vishika Laxman Yendira Ee Panchayithi Going To Release On October 6th

ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది