Yendira Ee Panchayithi Movie Review: ఏందిరా ఈ పంచాయితీ రివ్యూ.. ప్రేమ కథలో ట్విస్టులు
Yendira Ee Panchayithi Movie Review : సినిమాల్లో ప్రేమ కథలు అనేది కామన్.. ప్రేమ కథ లేకుండా సినిమాలు తీయడం అనేది దాదాపు అసాధ్యం. అలానే ప్రేమ కథలకు కాస్త సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, విలేజ్ బ్యాక్ డ్రాప్ అద్దితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టుగా అవుతుంది. ఇలాంటి అన్ని రకాల ఎమోషన్స్‌తో ఏందిరా ఈ పంచాయితీ అనే చిత్రం రాబోతోంది. భరత్, విషికా లక్ష్మణ్ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Yendira Ee Panchayithi Movie Review : కథ
రామాపురం అనే ఊరు. అందులో ఊరి పెద్ద, ఆయన చుట్టూ కొంత మంది మనుషులు. ఆ ఊర్లో అల్లరిచిల్లరగా తిరిగే ఆకతాయిలు.. ఊర్లో దొంగతనాలు.. ఊర్లోని పెద్ద మనుషుల ఆకస్మిక మరణాలు.. పోలీసు కేసులు.. మధ్యలో ఫ్రేమ కథ.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించేలా ఉంటుంది. పోలీసు కావాలనుకునే కుర్రాడు అభి( భరత్). కానీ తన స్నేహితులతో కలిసి ఊర్లో చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. ఊరి పెద్ద (కాశీ విశ్వనాథ్) కూతురు యమున (విషికా)తో అభి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి? యమున తండ్రినే చంపేందుకు అభి ఎందుకు వెళ్తాడు? పోలీసుల ఎంట్రీతో అభి జీవితం ఎలా మారింది? చివరకు అభి తన ప్రేమను గెలిపించుకున్నాడా? తన మీద పడ్డ మచ్చలను తొలిగించుకున్నాడా? లేదా? అన్నది కథ.
Yendira Ee Panchayithi Movie Review : నటీనటులు
అభిగా భరత్ చక్కగా నటించాడు. తొలి సినిమానే అయినా కూడా.. డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషనల్ సీన్లు, కామెడీ సీన్లు అంటూ అన్నింట్లోనూ పాస్ అయ్యాడు. ఇక విషికా అయితే యమున పాత్రలో జీవించేసింది. పల్లెటూరు అమ్మాయిలా ఎంతో అందంగా కనిపించింది. కాశీ విశ్వనాథ్ పాత్ర ఎమోషనల్‌గా సాగుతుంది. ఊర్లోని పెద్దగా సుధాకర్‌గా రవి వర్మ ఆకట్టుకుంటాడు. హీరో స్నేహితుల కారెక్టర్లు సినిమా ఆసాంతం నవ్విస్తాయి. మిగిలిన పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి.
Yendira Ee Panchayithi Movie Review : విశ్లేషణ
ప్రేమ కథను ఓ పల్లెటూరి నేపథ్యంలో చెప్పాలనుకోవడం.. అందులోనూ కేవలం లవ్ స్టోరీని పెట్టకుండా.. చిక్కుముళ్లు, సమస్యలు అని తిప్పడం.. దాని కోసం రాసుకున్న ప్లాట్.. ఎంచుకున్న కథనం.. ట్విస్టులు అన్నీ బాగుంటాయి. మొదటి చిత్రమే అయినా దర్శకుడు మాత్రం గ్రిప్పింగ్‌గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఊపు.. సెకండాఫ్‌లో అంతగా కనిపించదు.
ప్రథమార్దం అంతా సాఫీగా సాగుతుంది. సరదా సన్నివేశాలతో హాయిగా ముందుకు వెళ్తుంది. సెకండాఫ్ ప్రారంభం కాస్త నిదానంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు, హీరో ఎలివేషన్లు, ఆర్ఆర్ ఆ టైంలో అద్భుతంగా అనిపిస్తాయి. చివరకు ఏందిరా ఈ పంచాయితీ టైటిల్‌కు న్యాయం చేసినట్టుగా అనిపిస్తుంది. దర్శకుడు ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది.
ఏందిరా ఈ పంచాయితీ మూవీలోని పాటలు, మాటలు జనాలను ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా కెమెరాపనితనం ఆకట్టుకుంటుంది. విజువల్స్ సహజంగా కనిపిస్తాయి. ఎడిటర్ జేపీ పనితనం ఆకట్టుకుంటుంది. ఎంతో షార్ప్‌గా, క్రిస్పీగా కట్ చేశాడు. నిర్మాణ విలువలు అద్భుతంగా అనిపిస్తాయి. కొత్త నిర్మాత ప్రదీప్ కుమార్ ఖర్చుకి ఏ మాత్రం తగ్గకుండా కొత్త టీంతో మంచి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు.
దితెలుగున్యూస్ రేటింగ్ : 2.75