Viral Photo : చారడేసి కళ్లతో ముద్దులొలుకున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా?
Viral Photo : ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కరోనా కాలం నుండి అభిమానులు తమ ఫేవరేట్ స్టార్స్‌కి సంబంధించిన పిక్స్ ని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. వాటిలో కొన్ని క్యూట్ పిక్స్ కూడా బయట పడుతున్నాయి. అయితే తాజాగా ఓ చిన్నారి క్యూట్ పిక్ బయటకు రాగా, అది స్వయంగా ఆ హీరోయిన్ షేర్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మహాత్మ సినిమాలో నటించిన భావన మీనన్.శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన మహాత్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళీ ముద్దుగుమ్మ భావన.
ఆ తరువాత టాలీవుడ్ లో సినిమాలు చేయకపోయినా 2017లో కిడ్నాప్ వ్యవహారంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ సినిమాల్లోనూ బిజీగా ఉంది. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత భావన తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అత్యంత వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడింది.

bhavana childhood photo goes viral in social media
Viral Photo : భావన అంటే నమ్ముతారా..!
2017లో ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని భావన తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటలకు పైగా దాడి చేశారు అని పేర్కొంది భావన. ఒంటరి, హీరో వంటి చిత్రాలలో నటించిన భావన దాదాపు 70 సినిమాలలో నటించింది. ఇక ఇప్పుడు అడపాదడపా సినిమాలతో పలకరిస్తున్న భావన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. ఒక్కోసారి క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మాత్రం తన చిన్ననాటి పిక్ షేర్ చేసి వార్తలలోకి ఎక్కింది. భావనని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు.