Viral Photo : బాబూ.. సిలిండ‌ర్ తీసుకెళ్లే మార్గం ఇదా.. మ‌రీ ఇంత‌లా సాహ‌సం చేయాలా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Photo : బాబూ.. సిలిండ‌ర్ తీసుకెళ్లే మార్గం ఇదా.. మ‌రీ ఇంత‌లా సాహ‌సం చేయాలా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :9 July 2022,8:20 am

Viral Photo : సోష‌ల్ మీడియాలో నిత్య వివిధ ర‌కాల వీడియోలు, ఫొటోస్ వైర‌ల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫ‌న్నీగా ఉంటే మ‌రికొన్ని డేంజ‌ర్ గా ఉంటాయి. కొన్ని వీడియోస్ భ‌య‌పెట్టిస్తాయి. మ‌రొకొన్ని క‌డుపుబ్బ న‌వ్విస్తాయి. ఇందులో కొన్ని స‌ర‌ద‌గా కోసం చేస్తే మ‌రికొంద‌రు నిర్ల‌క్ష్యంగా చేస్తుంటారు. అలాగే కొంద‌రు తీసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తూ కామెంట్స్ కూడా చేస్తుంటారు. అయితే కొంత‌మంది వాహ‌నాల్లో ప్ర‌యాణించేట‌ప్పుడు ప‌రిమితికి మించి వ‌స్తువులు తీసుకెళ్తుంటారు.

అలా సేఫ్ గా వెళ్తే ఎటువంటి ప్రాబ్ల‌మ్ ఉండ‌దు. కానీ.. ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే మాత్రం ఊహించ‌ని న‌ష్టం జ‌రుగుతుంది. అయితే నిత్యం రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నా కొంద‌రిలో మార్పు మాత్రం రాదు. బైక్ పై వెళ్తూ ప‌లు వ‌స్తువ‌లు క్యారీ చేయ‌డం.. లేదా ఇద్ద‌రి కంటే ఎక్కువ మంది ఒకే బైక్ పై ప్ర‌యాణించ‌డం వంటివి చేస్తుంటారు. అలాగే హెల్మెట్ ధ‌రించ‌కుండా ప్రయాణం చేయ‌డం.. రాష్ డ్రైవింగ్ చేయ‌డం వంటివి చేస్తుంటారు. దీంతో ప్రామాదాల భారిన ప‌డుతుంటారు. ఇలాంటివి నిత్యం చూస్తుంటాం అయినా కూడా మ‌న‌లో చాలా మంది అలాగే చేస్తుంటారు.

man daring stunts with cylinder on bike goes viral in social media

man daring stunts with cylinder on bike goes viral in social media

మ‌న‌లో చాలా మందికి రోడ్డుపై ఇలాంటి దృశ్యాలు క‌నిపిస్తుంటూనే ఉంటాయి. ప్ర‌స్తుతం ప్ర‌మాద‌క‌రంగా బైక్ పై ప్ర‌యాణిస్తున్న ఫొటో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆ బైక్ పై ఇద్ద‌రూ సాధార‌ణంగా ప్ర‌యాణిస్తే ప‌ర్లేదు కానీ… ఒక గ్యాస్ సిలిండ‌ర్ పెట్టుకుని దానిపై ఓ వ్య‌క్తి కూర్చుని ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌యాణిస్తున్నారు. పైగా ముందు ఒక బాక్స్ పెట్టుకుని హెల్మెట్ లేకుండా కూర్చున్నాడు. దీంతో నెటిజ‌న్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది ప్ర‌మాద‌క‌రం అనితెలిసినా కూడా కొంద‌రు ప‌ట్టించుకోర‌ని మండిప‌డుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది