Bheemla Nayak : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘భీమ్లా నాయక్’.. న్యూ రిలీజ్ డేట్ ఇదే..

Authored By mallesh | The Telugu News | Published on: December 21, 2021, 4:20 pm

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అశేష అభిమానులకు నిరాశ కలిగించే వార్త చెప్పారు ప్రొడ్యూసర్స్. పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. కానీ, అదే టైంకు పెద్ద చిత్రాలు ‘ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్’ విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర విడుదల తేదీని మార్చినట్లు ప్రొడ్యూసర్స్ తెలిపారు. విడుదల తేదీని ఫిబ్రవరి 25 …శివరాత్రికి మార్చినట్లు అనౌన్స్ చేశారు.వచ్చే ఏడాది జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’, 14న ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా సినిమాల విడుదలనేపథ్యంలో థియేటర్స్‌కు ఇబ్బందులు రాకుండా ఉండేందుకుగాను.

సినిమా పరిశ్రమకు లాభం జరిగేందుకుగాను చిత్ర విడుదల పోస్ట్ పోన్ చేసినట్లు ప్రొడ్యూసర్స్ పేర్కొన్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల పోస్ట్ పోన్ విషయమై ప్రొడ్యూసర్ చినబాబు, హీరో పవన్ కల్యాణ్‌ను సంప్రదించినట్లు దిల్ రాజు తెలిపారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.ఫిబ్రవరి 25న ‘ఎఫ్ 3’ సినిమా విడుదల కావాల్సి ఉందని, కానీ, ఆ తేదీని ‘భీమ్లానాయక్’ కోసం ఇచ్చేసినట్లు దిల్ రాజు తెలిపారు. ఏప్రిల్ 14న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ విడుదల అవుతుందని, ఏప్రిల్ 29న ‘ఎఫ్ 3’ రిలీజ్ అవుతుందని ఈ సందర్భంగా దిల్ రాజు వివరించారు.

Bheemla nayak film release post poned

Bheemla nayak film release post poned

Bheemla Nayak : థియేటర్స్‌కు సంబంధించి ఇబ్బందలు రాకూడదనే ఈ డెసిషన్…

ఇకపోతే ఏప్రిల్ 1న సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’ మూవీ విడుదల కానుంది. ‘భీమ్లానాయక్’ చిత్రం మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. ఈ చిత్రానికి సాగర్ .కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇకపోతే చిత్రానికి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్‌గా నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp