Bheemla Nayak : రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవు.. భీమ్లా నాయక్‌ కాస్త వెయిట్‌ చేయాల్సింది కదా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bheemla Nayak : రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవు.. భీమ్లా నాయక్‌ కాస్త వెయిట్‌ చేయాల్సింది కదా!

 Authored By himanshi | The Telugu News | Updated on :27 February 2022,9:00 pm

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్‌ సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. నైజాం ఏరియాలో భారీగా వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా ఏపీలో మాత్రం కాస్త తక్కువ దక్కించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ టికెట్ల రేట్లు కాస్త తక్కువగా ఉండటం వల్ల వసూళ్లు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏపీ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో వైకాపా నాయకులు మరియు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ అభిమానుల విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పంతానికి వెళ్ళాడు అనేది కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టికెట్ రేట్ల పెంపు విషయమై అతి త్వరలోనే జీవో వస్తుందని అందరికీ తెలుసు.

ఇప్పటికే టికెట్లు రేట్ల పెంపుకు సంబంధించిన మార్గ దర్శకాలు రెడీ అయ్యాయి. అది గవర్నమెంటు అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. ఈ లోపు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందడంతో ప్రభుత్వ వర్గాల వారు మరియు సంబంధిత మంత్రి ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. కనుక జీవోను విడుదల చేయలేక పోయారు. ఈ లోపు సినిమాను విడుదల చేసి ఏపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడం ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ రూపొందిన సినిమా.. భారీగా వసూలు రావలసిన సినిమా కనుక కాస్త ఆలస్యమైనా జీవో వచ్చే వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత విడుదల చేస్తే బాగుండేది అంటూ స్వయంగా పవన్ అభిమానులు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.జీవో విడుదలకు ముందు భీమ్లా నాయక్‌ సినిమాను విడుదల చేసి ఇప్పుడు నానా హంగామా చేస్తే ఎలా అంటూ వైకాపా మంత్రులు ఆరోపిస్తున్నారు. పవన్ సినిమాలను తొక్కేసిన అవసరం ఎవరికీ లేదని..

Bheemla Nayak has to wait a bit

Bheemla Nayak has to wait a bit

అయినా ఒక్క సినిమాను తొక్కినంత మాత్రాన వచ్చేది ఏమీ లేదని వైకాపా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా పవన్ అభిమానులు కాస్త సంయమనంతో ఆలోచించి మాట్లాడాలంటూ వైకాపా నాయకులు సూచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు కనుక ఇలాంటి వ్యవహారాలు కొన్ని జరుగుతున్నాయి. గతంలో అఖండ ఆ తర్వాత బంగార్రాజు సినిమాలు కూడా వచ్చాయి. ఆ సినిమాలు పాతటికెట్ల రేట్లు తోనే నెట్టుకు వచ్చాయి. మరి ఆ సినిమాలకు లేని సమస్య ఇప్పుడు ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు కనుక ఈ విషయం రాజకీయ మవుతోంది అంటూ వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైకాపా ను విమర్శించడం విడ్డూరంగా ఉందని.. అఖండ సినిమా సమయంలో ఎందుకు వీళ్లు మాట్లాడలేదు అంటూ వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది