Senior Heroes : ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు ఒకే సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారా.. ఏది హిట్,ఏది ఫట్..!
Senior Heroes : టాలీవుడ్‌లో సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల కావడం ఎప్పటి నుండో ఉంది. 1982లో ఒకేసారి కృష్ణ, కృష్ణంరాజు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మోహన్ బాబు, మురళీ మోహన్ వంటి స్టార్ హీరోలు పాల్గొన్నారు. ఇంతమంది హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీపడడంతో పోటా ఇంట్రెస్టింగ్‌గా మారింది. 1982 జనవరి 1న దాసరి నారాయణరావు నిర్మించి నటించిన చిత్రం జయసుధ విడుదలైంది. మురళీమోహన్ , దాసరి నారాయణరావు, జయసుధ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం అపజయం పొందింది. ఇక జనవరి 9న అనురాగ దేవత సినిమా రిలీజైంది. ఈ సినిమా హిందీ రీమేక్‌గా రూపొందింది. నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు వంటి చిత్రాలను ఎన్టీఆర్ రీమేక్ చేశారు.
అనురాగ దేవత చిత్రం హిందీలో ఆశ మూవీ రీమేక్‌గా రూపొందింది. ఇందులో జయసుధ, శ్రీదేవి కథానాయికలుగా నటించారు. బాలకృష్ణ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో పాటలు కూడా మంచి విజయం సాధించడంతో చిత్రం మంచి విజయం సాధించింది. హరికృష్ణ ఈ చిత్రానికి నిర్మాత కావడం మరో విశేషం. ఇక 1982 లో కొడాలి బోసుబాబు దాసరి నారాయణరావు దర్శకత్వంలో రాగ దీపం చిత్రాన్ని నిర్మించాడు ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.జనవరి 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరచింది.
Senior Heroes : ఎవరు గెలిచారు.
ఇక జనవరి 14న రెండు సినిమాలు విడుదలయ్యాయి. కృష్ణంరాజు నటించిన మధుర స్వప్నం ఒకటి . యుద్ధనపూడి సులోచనరాణి నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జయప్రద, జయసుధ ఇందులో కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని ఆసక్తికరంగానే మలచిన కూడా ఎందుకు విజయం సాధించలేకపోయింది. ఇక జనవరి 14న విడుదలైన మరో చిత్రం బంగారు భూమి. ఈ చిత్రం డ్రామా ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందింది. ఇందులో కృష్ణ, శ్రీదేవి, రావు గోపాల్ రావు, గుమ్మడి, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, కృష్ణ కుమారి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్, సూర్యకాంతం, కవిత తదితరులు నటించారు.
ఈ సినిమాకి దర్శకత్వం పి సి రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత యస్ పి వెంకన్న బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జె వి రాఘవులు స్వరాలు సమకుర్చరు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. సంక్రాంతి బరిలో అప్పటి టాప్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు పోటీ పడగా, చివరకు కృష్ణ మాత్రం పై చేయి సాధించాడు. అయితే ఇప్పట్లో కృష్ణ, ఎన్టీఆర్ మధ్య పోటీ ఎక్కువగా ఉండేది. వారిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గమనించేవారు. అయితే అన్నింటి పరంగా బంగారు భూమి చిత్రం మంచి వసూళ్లతో కృష్ణకి సూపర్ హిట్ అందించింది.