బిగ్ బాస్‌పై అసంతృప్తి.. అందుకే ఫినాలేకు ఆ ముగ్గురు దూరం!
బిగ్ బాస్ షోకు వచ్చే ముందు అన్నీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, మంచి చూపించాలా? లేదా టీఆర్పీ కోసం ఒకరిని బ్యాడ్ చేయాలన్నా సరే అంతా బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది. అయితే నాల్గో సీజన్‌లో మాత్రం ఎలిమినేషన్ విషయంలోనూ అవకతవకలు జరిగాయని అందరూ ఒప్పుకునే అంశమే. బిగ్ బాస్ పక్షపాతానికి మొదటగా బలైంది దేవీ నాగవల్లి. మూడో వారంలో మెహబూబ్ ఎలిమినేషన్ దాదాపు ఖరారైంది. కానీ చివరకు దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయింది.

Bigg Boss 4 Telugu Finale Surya Kiran Amma Rajasekhar and Devi Nagavalli Not Attending
సూర్య కిరణ్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయాడు. దేవీ నాగవల్లి మూడో వారంలోనే వెళ్లిపోయింది. ఇక అమ్మ రాజశేఖర్ కోసం ఏకంగా ఎలిమినేషన్‌ను తీసేశారు. నోయల్ అనారోగ్యం కారణంగా బయటకు వెళ్లడంతో అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ వాయిదా పడింది. అలా అమ్మ రాజశేఖర్ ఓ వారం ఎక్కువగా ఇంట్లో ఉన్నాడు. ఈ ముగ్గురు మాత్రం బిగ్ బాస్ ఫినాలే వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ ముగ్గురి బిగ్ బాస్‌పై అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది.
అభిజిత్ విన్నర్ అవుతాడని తెలిసే.. అది భరించలేక.. అమ్మ రాజశేఖర్ వేడుకలకు దూరంగా ఉండొచ్చని టాక్ బయటకు వస్తోంది. మొదటి వారంలోనే తనను బయటకు పంపించడం,తనను నెగెటివ్‌గా చూపించడంపై సూర్య కిరణ్ హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక దేవీ నాగవల్లి సైతం తన ఎలిమినేషన్ అన్యాయం జరిగిందని భావించినందునే ఈ ఫినాలే వేడుకలకు దూరంగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అందుకే ఇంట్లోకి ఈ ముగ్గురు తప్పా మిగిలిన అందరూ వచ్చి సందడి చేశారు. ఇక ఫినాలే స్టేజ్ మీదైనా కనిపిస్తారా? లేదా? అన్నది చూడాలి.