Amma Rajasekhar : మోసం చేశారంటూ మొత్తుకుంటున్న అమ్మ రాజశేఖర్.. మెన్న నితిన్, నేడు గోపిచంద్
Amma Rajasekhar : అమ్మ రాజశేఖర్.. ఒకప్పుడు టాప్ కొరియోగ్రాఫర్. దర్శకుడిగాను కూడా ఈయన మంచి సినిమాలు తీసారు. అయితే ఆయన కెరియర్ గ్రాఫ్ రాను రాను పడిపోతూ వచ్చింది. నృత్యదర్శకుడి నుంచి `రణం` చిత్రంతో దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం `హైయ్ ఫైవ్`. ఫన్ అండ్ గన్ అనేది ఉపశీర్షిక. రాధా రాజశేఖర్ నిర్మాత. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కొత్త పాత నటీనటుల కలయికతో రూపొందిన ఈ చిత్రం జూలై 22న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా పలు ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా గోపిచంద్ మోసం చేశాడంటూ అమ్మ రాజశేఖర్ ఆరోపణలు చేశారు. మరి అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి దర్శకుడిగా ‘రణం’, ‘ఖతర్నాక్’, ‘టక్కరి’ వంటి సినిమాలను తెరకెక్కించాడు అమ్మ రాజశేఖర్.
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. ఉన్నన్ని రోజులు అనేక రకాల ఎమోషన్స్ పండిస్తూ నానా హంగామా చేశాడు. ఇక తాజాగా హైయ్ ఫైవ్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హీరోలని ఏకి పారేస్తున్నాడు. చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ ప్రవర్తన తనను ఎంతగానో భాదపెట్టిందని భావోద్వేగానికి లోనైయ్యాడు. హై ఫైవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నితిన్‌ను గెస్ట్‌గా పిలిచాడట. తను కూడా వస్తానని చెప్పాడట. అయితే నితిన్ తన వ్యక్తిగత కారణాలతో ఈ వేడుకకు రాలేదు. దాంతో అసహనానికి గురైన అమ్మ రాజశేఖర్ నితిన్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. నితిన్‌కు అస్సలు డ్యాన్స్ రాదని, తనకు డ్యాన్స్ నేర్పించి ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించా. కానీ, ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పాడు. దానికి నేను వీడియో బైట్ అయినా పంపమని కోరాను. అదీ ఇవ్వలేదు. అంటూ భావోద్వేగానికి లోనైయ్యాడు. తాజాగా గోపీచంద్‌పై విరుచుకుపడ్డారు అమ్మ రాజశేఖర్.
వీరిద్దరిలో కాంబినేషన్‌లో వచ్చిన ‘రణం’ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో గోపీచంద్‌తో మరో సినిమా చేయాలనుకున్నారట ఈ డైరెక్టర్. అందుకే తనకొక స్టోరీ లైన్ కూడా వినిపించారట. అదే సమయంలో వెంకటేశ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో అదే స్టోరీ లైన్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట అమ్మ రాజశేఖర్. అదే సమయంలో గోపీచంద్ నటించిన ‘శంఖం’ తన స్టోరీ లైన్‌తోనే తెరకెక్కిందని గమనించారట. దీంతో వెంకటేశ్‌తో సినిమా ఛాన్స్ పోయిందని పేర్కొ్న్నారు ఈ డైరెక్టర్. అప్పటినుండే తన కెరీర్ ఇలా అయిపోయిందంటూ గోపీచంద్‌పై ఆరోపణలు చేశారు అమ్మ రాజశేఖర్. రణం సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న తర్వాత ప్రభాస్ కు కథ చెప్పే అవకాశం దక్కిందని ఆయన తెలిపారు.అయితే ప్రభాస్ పిలిచిన సమయంలో వెళ్లకుండా తాను రెండు రోజులు ఆలస్యంగా వెళ్లానని ఆయన తెలిపారు. తాను ఆలస్యంగా వెళ్లడం వల్ల ప్రభాస్ ను కలిసి కథ చెప్పే ఛాన్స్ దక్కలేదని ఆయన వెల్లడించారు.
ఆ సమయంలో నితిన్ పాటకు డ్యాన్స్ మాస్టర్ గా చేసే ఛాన్స్ దక్కిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత నితిన్ తో సినిమా తీసే అవకాశం దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు.టక్కరి సమయంలో బీవీఎస్ రవి నా దగ్గర పని చేశాడని బీవీఎస్ రవి కథను నిర్మాతలకు చెప్పి ఒప్పించడంతో నా ఈగో హర్ట్ అయిందని ఆయన తెలిపారు. ప్రభాస్ కు ఎవరేం చెప్పారో తెలియదని సినిమా ఛాన్స్ మాత్రం పోయిందని ఆయన అన్నారు.ప్రభాస్ ఇప్పటివరకు తన కథ వినలేదని పరోక్షంగా తన మొహం కూడా చూడలేదని అమ్మ రాజశేఖర్ తెలిపారు. ప్రస్తుతం రాజశేఖర్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఫేడవుట్ అయిపోయిన తర్వాత అమ్మ రాజశేఖర్ హీరోలపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఒకప్పుడు డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలకు పనిచేశారు అమ్మ రాజశేఖర్. కానీ మెల్లగా ఆయన కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని కొందరు విమర్శలు చేస్తున్నారు.