Bigg Boss 5 Telugu : రవికి బిగ్ బాస్ సాయం.. సీక్రెట్ టాస్క్ గెలవడమేంటని నెటిజన్లు ఫైర్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 13 November 2021, 4:00 pm

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ పదో వారంలో రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవి గురించి. బీబీ హోటల్ టాస్క్‌లో భాగంగా రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఎవ్వరూ కనిపెట్టకూడదు.. ఎవ్వరైనా పసిగడితే సీక్రెట్ టాస్క్‌లోఓడిపోయినట్టే అని చెప్పారు. కానీ రవి చేసిన ప్రతీ టాస్కును అందరూ కనిపెట్టేశారు. అది సీక్రెట్ టాస్క్ అని అందరూ కనిపెట్టేశారు. పప్పులో ఉప్పు, నీళ్లో కారం, మానస్ ప్రియాంకల మీద పడటం, వారిని డిస్టర్బ్ చేయడం వంటివి చేశాడు.

కాజల్ డబ్బులను దొంగతనం చేయడం ఇలా రవి ఎన్ని పనులు చేసినా కూడా రవి మీద అందరికీ అనుమానం వచ్చింది. అది సీక్రెట్ టాస్క్ అయి ఉంటుందని అంతా కనిపెట్టేశారు. కానీ చివరకు మాత్రం రవి సీక్రెట్ టాస్కులో గెలిచినట్టు ప్రకటించాడు బిగ్ బాస్. దీంతో అందరూ ఫైర్ అవుతున్నారు. సీక్రెట్ టాస్క్ అంతా కనిపెట్టేశారు. అయినా కూడా విన్ అయ్యాడని ఎలా చెబుతారు అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దొంగతనం చేయడం షన్ను చూశాడు.

Bigg Boss 5 Telugu Ravi Secret Task Got Fail

Bigg Boss 5 Telugu Ravi Secret Task Got Fail

Bigg Boss 5 Telugu : సీక్రెట్ టాస్కులపై రవి..

నీళ్లలో కారం కలపడంపై కాజల్ కనిపెట్టింది. రవి చేసి ఉంటాడని చెప్పింది. ఇన్ని రకాలుగా దొరికినా కూడా రవికి కెప్టెన్సీ కంటెండర్‌గా చాన్స్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అంతా భావిస్తున్నారు. అయితే దీనిపై బిగ్ బాస్ టీం ఏమైనా స్పందిస్తుందా? అంటే అదేమీ ఉండదు. ముందు నుంచి కూడా బిగ్ బాస్ టీం రవికి ఫేవర్‌గా పని చేస్తోందనే ముద్ర పడిపోయింది. రవిని తదుపరి వారం కాపాడేందుకు ఇలా చేసి ఉంటారేమో అని అనుమాన పడుతున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp