Shanmukh : షణ్ముక్‌పై సిరి కంప్లయింట్.. అయినా ఫ్రెండ్లీ హగ్స్ ఇస్తావంటూ నాగార్జున కౌంటర్..
Shanmukh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ గెలుచుకునేందుకుగాను కంటెస్టెంట్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వీకెండ్‌కు సంబంధించిన ప్రోమోను శనివారం స్టార్ మా వారు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. సదరు ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.స్టార్ మా వారు రిలీజ్ చేసిన ప్రోమోలో ‘ప్యార్ సే కరెంగె సబ్ కా స్వాగత్’ సాంగ్‌తో ‘బిగ్ బాస్’ హోస్ట్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత రెడ్ బాక్స్ అయిన కంప్లయింట్ బాక్స్ గురించి నాగార్జున్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. దానిని సూచించి కంటెస్టెంట్స్ ఎవరైనా కంప్లయింట్స్ చేయొచ్చని చెప్పాడు. దాంతో సిరి షణ్ముక్‌పైన ఫిర్యాదు చేసింది. తానేం చేశానని షణ్ముక్ ప్రశ్నించగా, సిరి కోసం కాకుండా శ్రీరామ్ కోసం ఆడుతున్నావంటూ ఫన్నీ కౌంటర్ వేశాడు నాగ్.ఈ క్రమంలోనే తనను షణ్ముక్ తిడుతున్నాడంటూ సిరి పేర్కొంది. ఇంతలో నాగార్జున జోక్యం చేసుకుని సిరి ఫ్రెండ్ అయినందుకుగాను షణ్ముక్ సిగ్గుపడుతున్నాడని చెప్తూనే..

bigg boss 5 telugu siri compaints on shanmukh
Shanmukh : తనను షణ్ముక్ తిడుతున్నాడన్న సిరి.. సన్నీ తన హార్ట్ బ్రేక్ చేశాడన్న కాజల్..
ఫ్రెండ్లీ హగ్స్ ఇస్తానే ఉండాలని అని నాగ్ నవ్వులు పూయించాడు. ఇక ఆ తర్వాత కాజల్ సన్నీపై కంప్లయింట్ చేసింది. ఏమైనా మాట్లాడితే..‘ఆత్రం ఆత్రం’ చేస్తూ తనపైన అరిచేస్తున్నాడని కాజల్ చెప్పింది. దాంతో సన్నీ సారీ చెప్పాడు. ఇక తర్వాత ‘ఫస్ట్ ఫైనలిస్ట్’ ట్రోఫీ వద్దకు వెళ్లి చూసుకోవాలని శ్రీరామ్‌కు నాగార్జున చెప్తాడు. శ్రీరామ్ సేఫ్ అయితే ట్రోఫీ తనదేనని, లేదంటే కాదని చెప్పాడు..నాగార్జున.. అలా చెప్పిన తర్వాత శ్రీరామ్ అక్కడికి వెళ్లగానే ప్రోమో ముగుస్తుంది. ఆ తర్వాత ఏం అవుతుందో తెలియాంటే బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే.
Weekend vachesindi ante @iamnagarjuna tho entertainment vachesindi .. Evariki evarimida complaints unayo chuddam!#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/3PAJ5ZgSyO
— starmaa (@StarMaa) December 4, 2021