Bigg Boss 6 Shanmukh : బిగ్ బాస్ 6 లోకి మరో టాప్ యూట్యూబర్.. అతనికి షణ్ముక్‌ను మించిన ఫాలోయింగ్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Shanmukh : బిగ్ బాస్ 6 లోకి మరో టాప్ యూట్యూబర్.. అతనికి షణ్ముక్‌ను మించిన ఫాలోయింగ్..

 Authored By mallesh | The Telugu News | Updated on :11 January 2022,6:00 pm

Bigg Boss 6 Shanmukh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, త్వరలో ప్రారంభమయ్యే ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సీజన్ ఓటీటీ వర్షన్‌గా ఉండబోతున్న నేపథ్యంలో 24 గంటలు లైవ్ టెలికాస్ట్ అవుతుంటుంది. నిర్వాహకులు ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుండగా, ఇందులో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో బోలెడన్ని వార్తలొస్తున్నాయి.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. నిర్వాహకులు ఇప్పటికే కొంత మందిని కంటెస్టెంట్స్ గా సెలక్ట్ చేశారట. ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. కంటెస్టెంట్స్ వెరీ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఉండబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత సీజన్‌లో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను తీసుకున్నారు. కాగా, ఈ సీజన్ సిక్స్ ఓటీటీలో మరో టాప్ యూట్యూబర్‌ను తీసుకోబోతున్నారట.ఓటీటీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు కోసం తీసుకోబోయే ప్రతీ కంటెస్టెంట్ కూడా బయటి జనాలకు అందరికీ తెలిసిన వ్యక్తి అయి ఉండాలని నిర్వాహకులు భావిస్తున్నారట.

Bigg Boss 6 Shanmukh another to youtuber Bigg Following will be contestant ott

Bigg Boss 6 Shanmukh another to youtuber Bigg Following will be contestant ott

Bigg Boss 6 Shanmukh : ఆల్రెడీ కొంత మందిని సెలక్ట్ చేసిన నిర్వాహకులు..!

గత సీజన్ లో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేంత వరకు వెళ్లాడు. చివరకు రన్నరప్ గా మిగిలాడు. కాగా, ఈ సారి సీజన్ సిక్స్ లో రాబోయే టాప్ యూట్యూర్ కమ్ కంటెస్టెంట్ ఎక్కడి వరకు వెళ్తాడో చూడాలి. ఈ క్రమంలోనే ఈ సారి రియాలిటీ షో లోకి తీసుకోబోయే కంటెస్టెంట్‌ చాలా పాపులర్ యూట్యూబర్ అయి ఉండాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అందు కోసం సెర్చ్ చేస్తున్నారట. ఈ సారి ఓటీటీ వర్షన్ సీజన్‌లో కంటెస్టెంట్స్ అందరూ కేవలం తెలుగు భాషలోనే కాకుండా సౌతిండియన్ లాంగ్వేజెస్ అన్ని వచ్చిన వాళ్లు అయి ఉండాలని అనుకుంటున్నారట.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది