Bigg Boss 6 Telugu : టాప్ 3లో ఒక్క అమ్మాయి కూడా ఉండదా.. హౌస్ మెట్స్ కాన్ఫిడన్స్ పై పేలుతున్న జోకులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : టాప్ 3లో ఒక్క అమ్మాయి కూడా ఉండదా.. హౌస్ మెట్స్ కాన్ఫిడన్స్ పై పేలుతున్న జోకులు..!

 Authored By ramesh | The Telugu News | Updated on :7 December 2022,10:30 am

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 ప్రస్తుతం 13వ వారం ఆట కొనసాగుతుంది. ఈ వారం పెద్దగా టాస్క్ లు ఏమి ఇవ్వకపోయినా హౌస్ మెట్స్ లో ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉంటారనే టాస్క్ ఇచ్చారు. హౌస్ లో 1 టూ 7 బొర్డ్ లు ఇచ్చి ఎవరికి వారు ఏయే స్థానానికి వారు అర్హత ఉన్నారో మిగతా హౌస్ మెట్స్ ని ఒప్పించి ఆ నెమర్ వెనక నిలుచోవాల్సి ఉంటుంది. అయితే టాప్ 1 పొజిషన్ లో రేవంత్ తన ప్లేస్ ఫిక్స్ చేసుకోగా మిగతా హౌస్ మెట్స్ అందరు అతనికి ఓటు వేశారు. ఇక సెకండ్ ప్లేస్ లో శ్రీహాన్ థర్డ్ ప్లేస్ లో ఆది రెడ్డిని ఉంచారు. ఈ లిస్ట్ లో 6, 7 స్థానాల్లో రోహిత్, కీర్తిలు ఉన్నారు.

నాల్గవ స్థానంలో ఇనయా, ఐదవ స్థానంలో శ్రీ సత్య నిలబడ్డారు.హౌస్ మెట్స్ లెక్కలో చూస్తే టాప్ 3లో ఒక్క అమ్మాయి కూడా ఉండదని చెబుతున్నారు. కానీ బయట ఓటింగ్స్ చూస్తే రేవంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా సరే సెకండ్ ప్లేస్ లో ఇనయా దూసుకెళ్తుంది. ఈ వారం టికెట్ టు ఫినాలే గెలిచాడు కాబట్టి శ్రీహాన్ తప్ప అందరు నామినేషన్స్ లో ఉన్నారు. కాబట్టి ఇనయా కచ్చితంగా టాప్ సెకండ్ ప్లేస్ లో ఉండేలా ఓటింగ్స్ తెచ్చుకుంటుంది. అయితే హౌస్ మెట్స్ లెక్కల్లో మాత్రం ఇనయా 4వ స్థానంలో ఉంది. అంతేకాదు టాప్ 5 పక్కా అనుకుంటున్న కీర్తి 7వ స్థానంలో ఉంది. శ్రీ సత్య ఎలాగు ఈ వారం హౌస్ కి బై బై చెబుతుందని అనిపిస్తుండగా రోహిత్ కూడా దాదాపు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది.

Bigg Boss 6 Telugu audiance comedy about housemates top 5 list prediction

Bigg Boss 6 Telugu audiance comedy about housemates top 5 list prediction

సో ఎటొచ్చి వారు పెట్టుకున్న లిస్ట్ లో శ్రీ సత్య ఐదవ ప్లేస్ కాకుండా అసలు టాప్ 5 లో ఉండే ఛాన్స్ లేదు. టాప్ 2, 3 ల్లో ఉన్న శ్రీహాన్, ఆది రెడ్డిలను దాటి ఇనయా టాప్ 2కి వచ్చే ఛాన్స్ ఉంది. బయట ఓటింగ్స్ గురించి ఏమాత్రం అంచనా లేని హౌస్ మెట్స్ వారి పొజిషన్లు నిర్ణయించుకున్నారు. కానీ ఆడియన్స్ ఇచ్చే తీర్పు వేరేలా ఉంటుందని తెలిసిందే. మొత్తానికి రేవంత్ ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా పక్కా అవుతుండగా ఇనయా టాప్ 2 లో ఉంటుందని మాత్రం అంటున్నారు. మరి ఇనయాకి ఆ లక్కీ ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి.

 

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది