Bigg Boss 6 Telugu : ఈ వారం వెళ్లిపోయేది ఎవరో అప్పుడే లీక్ అయిపోయింది గా .. హౌస్ లో వాళ్ళకి కూడా తెలిసిపోయిందా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 6 Telugu : ఈ వారం వెళ్లిపోయేది ఎవరో అప్పుడే లీక్ అయిపోయింది గా .. హౌస్ లో వాళ్ళకి కూడా తెలిసిపోయిందా ?

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అన్ని భాష‌ల‌లో రంజుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఆరో సీజ‌న్ జ‌రుపుకుంటుంది.. ఈ సీజన్కు ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఆదివారం నాగర్జున ఒక హౌస్ మేట్ ని ఎలిమినేట్ చేస్తారు. అయితే ఆ షూటింగ్ అంతా శనివారం జరుగుతుంది కాబట్టి శనివారం సాయంత్రమే ఆదివారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :21 October 2022,10:00 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అన్ని భాష‌ల‌లో రంజుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఆరో సీజ‌న్ జ‌రుపుకుంటుంది.. ఈ సీజన్కు ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఆదివారం నాగర్జున ఒక హౌస్ మేట్ ని ఎలిమినేట్ చేస్తారు. అయితే ఆ షూటింగ్ అంతా శనివారం జరుగుతుంది కాబట్టి శనివారం సాయంత్రమే ఆదివారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని లీక్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం లీక్ అయింది.

నామినేష‌న్స్ లో ఉన్న వారిలో ఎప్పటిలానే మొదటి స్థానంలో రేవంత్ కొనసాగుతున్నాడు. అతనికి ప్రతివారం కూడా అందరికంటే ఎక్కువ స్థాయిలో ఓట్లు దక్కుతున్నాయి.ఇక అతని తర్వాత శ్రీహాన్ ఎప్పటిలోనే రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ అతనికి ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని ఓట్లు అయితే తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. ఇక అర్జున్ మూడవ స్థానంలోకి రావడం విశేషం. ఆదిత్య 4వ స్థానంలోకి వచ్చేసాడు. మొన్నటి వరకు ఆదిత్య కు చాలా తక్కువ స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఇక ఆదిరెడ్డి కూడా టాప్ 5 లో ఉండేందుకు పోటీ పడుతున్నాడు. అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో ఇప్పుడు అతను 5వ స్థానంలో ఉన్నాడు. ఇక ఫైమా ఆరు, ఏడవ స్థానంలో కీర్తి కొనసాగుతోంది.

Bigg Boss 6 Telugu rajasekhar eliminated this week

Bigg Boss 6 Telugu rajasekhar eliminated this week

Bigg Boss 6 Telugu : ఎవ‌రు వెళ‌తారు..

కీర్తి గతవారం కూడా టాప్ ఫైవ్ లో నిలిచింది. కానీ ఈసారి మాత్రం ఆమె అనుకున్నంత స్థాయిలో ఇప్పించడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.ఇక 8వ స్థానంలో అయితే మెరీనా నిలిచింది. ఆమె భర్త రోహిత్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రోహిత్ తర్వాత 10వ స్థానంలో వాసంతి కొనసాగుతోంది. ఆమె గత రెండు వారాల క్రితం టాప్ ఫైవ్ లో నిలిచినప్పటికీ ఇప్పుడుడౌన్ అయింది. చివరి మూడు స్థానాల్లో కొనసాగుతున్న వారి వివరాల్లోకి వెళితే.. ఇనయా సుల్తానా 11వ స్థానంలో , శ్రీ సత్య 12, చివరి 13వ స్థానంలో అయితే రాజశేఖర్ కొనసాగుతున్నాడు. మరి అత‌ను ఈ వారం ఎలిమినేట్ అవుతాడ‌ని అంటున్నారు. చూడాలి ఏం జ‌రుగుతుందో..

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది