Home » Entertainment » Bigg Boss 7 Team Want To Do Nani As Host New Season
Entertainment

Bigg Boss 7 : తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 7 కోసం నాని ని సంప్రదిస్తే ఏమన్నాడో తెలుసా!

Authored By
aruna
The Telugu News | Published on: January 28, 2023, 9:40 am
Advertisement

Bigg Boss 7 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 కోసం నిర్వాహకులు హోస్ట్‌ ని వెతికే పనిలో ఉన్నారు. నాగార్జున వరుసగా 5 సీజన్లకు పోస్టింగ్ చేసి ఇప్పుడు తదుపరి సీజన్ కి తాను హోస్ట్‌ గా వ్యవహరించలేను అంటూ వదిలేసి వెళ్లిన విషయం తెలిసిందే. బాలకృష్ణ, రానా, విజయ్ దేవరకొండ లతో పాటు ఇంకా పలువురు హీరోలను కూడా బిగ్బాస్ నిర్వాహకులు సంప్రదిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే నాచురల్ స్టార్ నానిని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో నాని బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. రెండవ సీజన్ కి నాని హోస్ట్‌ గా విధులు నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో నానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Advertisement

bigg boss 7 team want to do nani as host new season

చాలా మంది నాని పై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేయడం జరిగింది. దాంతో నాని ఒక్క సీజన్ కే నాని గుడ్ బై చెప్పేసాడు. ఈసారి మళ్లీ నాని తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదు. బిగ్ బాస్ వారు నానిని సంప్రదించే అవకాశం లేదు, ఒక వేళ నానిని బిగ్ బాస్ వారు సంప్రదించినా కూడా నాని నూటికి నూరు శాతం నో చెప్తాడు అనడంలో సందేహం లేదు. ఆయన వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు.. అయినా కూడా కొందరు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది.

Advertisement

bigg boss 7 team want to do nani as host new season

గతంలో బిగ్ బాస్ స్టేజ్ ఎక్కి తప్పు చేశాను అంటూ నాని ఇప్పటికీ బాధపడుతూనే ఉండి ఉంటాడు. అలాంటి నాని బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా సంప్రదిస్తాడు. ఒకవేళ బిగ్ బాస్ నిర్వాకులు సంప్రదించినా కూడా నాని ఎలా ఓకే చెప్తాడు అంటూ ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో బిగ్ బాస్ వారు నాని ని సంప్రదించడం.. ఆయన ఓకే చెప్పడం జరిగింది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం పూర్తిగా వాస్తవం. ఇలాంటి పుకార్లు కేవలం నానిని తక్కువ చేసేందుకు అంటూ నాని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాని దసరా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి