Nani : నాని స్ప్రైట్ యాడ్ కోసం తీసుకున్న పారితోషికం ఎంత?
Nani : టాలీవుడ్ హీరోలు సైడ్ ఇన్ కమ్ పై ఎక్కువ శ్రద్ద పెడుతున్నట్లుగా అనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది హీరోలు బ్రాండ్ అంబాసిడర్స్ గా మారుతున్నారు. ఏ స్థాయి హీరోలు ఆ స్థాయి లో కంపెనీలకు ప్రమోటర్స్ గా వ్యవహరిస్తూ ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. మహేష్ బాబు వందల కోట్ల రూపాయలను కేవలం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం వల్ల సంపాదిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆయన దారిలోనే మరో స్టార్ అల్లు […]
Nani : టాలీవుడ్ హీరోలు సైడ్ ఇన్ కమ్ పై ఎక్కువ శ్రద్ద పెడుతున్నట్లుగా అనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది హీరోలు బ్రాండ్ అంబాసిడర్స్ గా మారుతున్నారు. ఏ స్థాయి హీరోలు ఆ స్థాయి లో కంపెనీలకు ప్రమోటర్స్ గా వ్యవహరిస్తూ ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. మహేష్ బాబు వందల కోట్ల రూపాయలను కేవలం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం వల్ల సంపాదిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆయన దారిలోనే మరో స్టార్ అల్లు అర్జున్ కూడా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. బన్నీ కూడా పుష్ప క్రేజ్ తో భారీ గా సంపాదిస్తున్నాడు.
తాజాగా నాని కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఆయన స్ప్రైట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాని స్ప్రైట్ యాడ్ కి మంచి స్పందన వచ్చింది. ఈషా రెబ్బ ఈ యాడ్ లో కనిపించింది. నాని చాలా సింపుల్ గా ఈ యాడ్ లో కనిపించాడు. ఈ యాడ్ లో నటించినందుకు గాను నాని దాదాపుగా రెండు కోట్ల పారితోషికం తీసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సదరు యాడ్ టెలికాస్ట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కోసం మాత్రమే నాని ఫోటోను వారు వాడాల్సి ఉంటుంది. అయినా కూడా రెండు కోట్ల పారితోషికంను వారు ఇవ్వడం జరిగిందట.
నాని ఇటీవల శ్యామ్ సింగ రాయ్ మరియు అంటే సుందరానికి సినిమాలకు మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం దసరా సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొంటున్నాడు. షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో దసరా లుక్ లోనే స్ప్రైట్ యాడ్ లో ఆయన పాల్గొన్నాడు. మొత్తానికి నాని కూడా ఈ బ్రాండ్ అంబాసిడర్ జాబితాలో చేరడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా కొన్ని యాడ్స్ లో కనిపించిన నాని ఇప్పుడు చాలా స్పెషల్ అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుండి నాని వరుసగా కంపెనీలకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.