Bigg Boss OTT Telugu : అనిల్ రాథోడ్ ను కొట్టబోయిన మహేశ్ విట్ట.. షాకైన కంటెస్టెంట్లు.. అసలు ఏం జరిగిందంటే?
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడిప్పుడే కాంట్రవర్సీలు మొదలవుతున్నాయి. హౌస్ హీటెక్కుతోంది. మొదటి వారంలోనే కాంట్రవర్సీ ప్లేయర్ ముమైత్ ఖాన్ ను హౌస్ నుంచి పంపించేశారు. ఆ తర్వాత రెండో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. రెండో వారం వచ్చేసరికే హౌస్ లో కావాల్సినన్ని గొడవలు జరుగుతున్నాయి.ఇప్పటికే అఖిల్, ఆర్జే చైతూకు పడదు. అలాగే యాంకర్ శివతో కూడా అఖిల్ కు పడదు. ఈ ముగ్గురూ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. సరయుకు, యాంకర్ శివకు కూడా పడదు. అలాగే.. బిందుకు వారియర్స్ సభ్యులతో పడదు. ఇలా.. హౌస్ లో ఉన్న రెండు గ్రూపుల్లో దాదాపు అందరికీ కొందరితో విభేదాలు వచ్చేశాయి. గొడవలు కూడా పడుతున్నారు.
Bigg Boss OTT Telugu : ఉమ్మేశావా అంటూ అనిల్ రాథోడ్ పై మహేశ్ విట్ట సీరియస్
బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇస్తాడు. పోలీసులు వర్సెస్ దొంగలు టాస్క్ అది. ఆ టాస్క్ లో భాగంగా వారియర్స్ అందరూ పోలీసులుగా.. చాలెంజర్స్ అందరూ దొంగలుగా వేషాలు వేసుకుంటారు.టాస్క్ జరుగుతుండగా.. మహేశ్ విట్ట పోలీస్ గా ఉంటాడు. అనిల్ రాథోడ్.. దొంగగా ఉంటాడు. అనిల్ రాథోడ్ చేతులు కడుక్కొని చేతులను విదిల్చడంతో ఆ నీళ్లు మహేశ్ విట్ట మీద పడుతాయి. దీంతో ఏం చేస్తున్నార్రా.. ఏం వేస్తున్నారు మొహం మీద అంటాడు మహేశ్ విట్ట.దీంతో వాటర్ బ్రో.. అవి అంటాడు. ఉమ్ముతున్నారో ఏంటో.. చెప్పాలి కదా అంటాడు మహేశ్.

anil rathod and mahesh vitta fight in bigg boss ott telugu
బ్రో అవి వాటర్ బ్రో. ఎందుకు ఉమ్ముతారు అంటాడు అనిల్. దీంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. మరీ ఎవ్వరూ కావాలని మీద ఉమ్మరు అంటాడు అనిల్.అడిగే విధానం ఉంటది అంటాడు అనిల్. అరెయ్.. గిరెయ్ అంటే పడను అంటే.. ఎందుకు వేసినవ్ నా మీద అంటాడు. నా మీద ఎందుకు వేశావు.. అరెయ్ అంటా నేను.. నా మీద ఎందుకు వేశావు చెప్పు అంటూ అనిల్ మీదికి దూసుకెళ్తాడు మహేశ్ విట్ట.దీంతో అరెయ్ అంటే నేను పడను అంటాడు అనిల్. చివరకు ఇంటి సభ్యులు వచ్చి తనను కూల్ చేస్తారు. దీంతో అక్కడి నుంచి అనిల్ వెళ్లిపోతాడు.