Bigg Boss OTT Telugu : బిగ్‌బాస్.. మిత్ర కొనసాగింపు వెనుక ‘నో మనీ’ రహస్యం

Authored By aruna | The Telugu News | Published on: April 15, 2022, 6:02 pm

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతోంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పటి మాదిరిగానే ఈ బిగ్బాస్ కూడా ఆదరిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కార్యక్రమం కు సంబంధించిన రేటింగ్ విషయంలో.. ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన విషయం లో నిర్వాహకులు చాలా సంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కార్యక్రమానికి ఎప్పటిలాగే నాగార్జున హోస్టింగ్ చేస్తూ ఆసక్తికరంగా నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో మెల్ల మెల్లగా పలువురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు.ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ విషయంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అవుతున్నారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలోనే మిత్ర శర్మ కొనసాగడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమె రెండవ వారం మూడో వారంలోనే బయటకు వచ్చేస్తుంది అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఏమైనా పెద్దగా ఆదరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయినా కూడా ఈమెను బిగ్బాస్ నిర్వాహకులు కొనసాగించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం ప్రకారం పారితోషికం లేకుండానే కొనసాగుతున్నట్లు గా తెలుస్తోంది. బిగ్బాస్ నిర్వాహకులతో ఈమె పారితోషికం లేకుండా పరవాలేదని బిగ్బాస్లో కొనసాగించాలని డీల్ కుదుర్చుకుంది అనే ప్రచారం జరుగుతోంది. మిత్ర శర్మ సోషల్ మీడియాలో తన టీమ్ని పెద్ద ఎత్తున యాక్టివ్ గా ఉంచి తనకు ఓట్లు వేసే వారిని కొనుగోలు చేస్తున్నట్లుగా కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Bigg Boss OTT Telugu Mithra Sharma

Bigg Boss OTT Telugu Mithra Sharma

మొత్తానికి బిగ్బాస్లో కొనసాగడం కోసం మిత్ర శర్మ చాలానే ఖర్చు చేస్తుందంట. ఎందుకంటే ఆమె ఆస్తి చాలా పెద్దది అనే విషయం అందరికి తెలిసిందే. సీజన్ లో అందరి కంటే ఎక్కువగా ఆస్తి ఉన్నా మిత్రశర్మ ఇప్పుడు హౌస్ లో ఉన్న పలువురికి లక్షలకు లక్షలు ఇస్తానంటూ ఆఫర్లు ఇస్తోంది. ఇటీవలే స్రవంతి కి ఐదు లక్షల రూపాయలను ఊరికే ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది అట, ఆ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

aruna

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp