Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ బిందు మాధవి కెరీర్‌ ఆరంభంలో ఎంత పెద్ద మోసం చేసిందో తెలిస్తే షాక్‌ అవుతారు

 Authored By prabhas | The Telugu News | Updated on :16 March 2022,7:00 pm

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ మొదలయ్యి మూడు వారాలు పూర్తి కావస్తోంది. ఇప్పటికీ ఈ సీజన్ హాట్ ఫేవరెట్గా హీరోయిన్ బిందు మాధవి నిలిచింది. ఆమె ఖచ్చితంగా ట్రోఫీ అందుకుంటుంది అనే నమ్మకంతో అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. బిందుమాధవి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేస్తూ ఆమె విజయానికి తాము భరోసా అంటూ హడావుడి చేస్తున్నారు. బిందుమాధవి ఎలిమినేషన్ కి నామినేషన్ అయ్యింది అంటే వారు గంపగుత్తగా భారీ మొత్తంలో ఓట్లు వేసి ఆమెను సేవ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అఖిల్ ఈసారి విజేతగా నిలుస్తాడని భావించిన సమయంలో అనూహ్యంగా బిందుమాధవి తెరపైకి రావడంతో అతని పేరు హడావుడి తగ్గింది. బిందుమాధవి వ్యవహారం.. ఆమె కామ్ గోయింగ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా అభిమానులకు బాగా నచ్చింది. అందుకే ఆమెకి ఓట్లు వేస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.

హీరోయిన్గా తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో నటించిన బిందు మాధవి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం.. బిందు మాధవి మొదటి సినిమా ఆవకాయ బిర్యాని ఆ తర్వాత రెండో సినిమాగా తమిళ సినిమాలు చేసింది.మళ్లీ మూడో సినిమాగా పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన బంపర్ ఆఫర్ సినిమాలో నటించింది. పూరి సినిమా అవడంతో బంపర్ ఆఫర్ కి మంచి సక్సెస్‌ దక్కింది. దాంతో ఆ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్ మాధవి పరిచయమైన సమయంలో తాను ఒక తెలుగు అమ్మాయి అని చెప్పకుండా నార్త్‌ కు చెందిన అమ్మాయిని అని పరిచయం చేసుకుంది. ఆ సమయంలో నార్త్ అమ్మాయిల కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో తాను తెలుగమ్మాయిని అనే విషయాన్ని దాచింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

Bigg Boss OTT Telugu nonstop bindhu madhavi life interesting facts

Bigg Boss OTT Telugu nonstop bindhu madhavi life interesting facts

బిందు మాధవి తెలుగు అమ్మాయి కాదు అంటూ ప్రచారం చేయడం వల్లనే ఎక్కువ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి అని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ బిందు మాధవికి నిజంగానే తెలుగమ్మాయి అని పరిచయం చేసుకుంటే అన్ని ఆఫర్లు వచ్చేవి కావేమో. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు హీరోయిన్ టాలీవుడ్ లోకి వచ్చినా ఆఫర్లు రావడం లేదు. దాంతో ఇక్కడ నుండి కోలీవుడ్ కు వెళ్లినా బిందుమాధవి అక్కడ కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. చూడ్డానికి పాతికేళ్ల అమ్మాయిలాగా అనిపించే బిందు మాధవి వయస్సు 35 సంవత్సరాలు. ఆమె వెంటపడుతున్న శివకి పాతిక సంవత్సరాలు. అంటే ఆమెకు అతడికి దాదాపుగా పది సంవత్సరాల గ్యాప్‌ ఉందన్నమాట. కానీ అలా అనిపించకుండా బిందు మాధవి చాలా అందంగా కనిపిస్తుంది అంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి