Bigg Boss OTT Telugu : ఈ వారం డబుల్ ఎలిమినేషన్ రీ ఎంట్రీ పక్కా!
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ ప్రారంభమయ్యి అప్పుడే నాలుగు వారాలు పూర్తి కావస్తుంది. ఇప్పటి వరకు ముమైత్ ఖాన్, శ్రీ రాపాక మరియు రేడియో జాకీ చైతు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు కూడా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీ రాపాక విషయంలో ఎక్కువ విమర్శలు లేకుండా ముమైత్ ఖాన్ మరియు రేడియో జాకీ చైతు ఎలిమినేషన్ విషయం లో మాత్రం చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే వారిద్దరూ కూడా ఎలిమినేషన్ కాకుండా ఉండాల్సిన వారు. వారిద్దరూ కూడా టాప్ 5 వరకు ఉండాల్సిన కంటెస్టెంట్స్ అంటూ ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చైతూ వెళ్లి పోయిన సమయంలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడంలో అతను బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేయడం ఏంటి అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరిని ఈ వారం ఎలిమినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆ ఇద్దరు ఎవరు అనేది మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇద్దరిని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు అనే విషయానికి వస్తే.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని రీ ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఒక్కరు ఎవరు అనేది ఊహించుకోవచ్చు.

Bigg Boss OTT Telugu nonstop double elimination for this week and re entry too
శ్రీ కాకుండా ముమైత్ ఖాన్ లేదా చైతూ ల్లో ఒకళ్ళు అయి ఉండొచ్చు అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా షో వైపు చూస్తున్నారు. ఇప్పటికే మంచి రసకందాయంలో షో పడింది. తప్పకుండా ఈ యొక్క మార్పు అనేది కచ్చితంగా అదనపు ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. చైతూ మరియు ముమైత్ఖాన్ లలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారు అనేది చూడాలి. డబల్ ఎలిమినేషన్ లో ఎవరికీ డబుల్ డోస్ పడుతుంది అనేది కూడా మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.