Bigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీ 24/7 అనేది మోసం.. అసలు విషయం ఏంటంటే!
Bigg Boss OTT : తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో భారీ ఎత్తున స్ట్రీమింగ్ కాబోతున్న ఈ షో కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం. ఇప్పటికే షో కి సంబంధించిన ప్రోమోలు మరియు కంటెస్టెంట్స్ పరిచయ వీడియోలు షూటింగ్ మరియు డాన్స్ ఇతర షూటింగ్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఆ విషయాలను చూపించడంతో క్లారిటీ వచ్చేసింది. ఇక నాగార్జున మరియు ఇతర కంటెస్టెంట్ పరిచయ కార్యక్రమం జరగబోతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ షో భారీ ఎత్తున రోజుకి 24 గంటలు కూడా స్ట్రీమింగ్ జరుగుతుంది అంటూ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.ఒక రియాలిటీ షో రోజులో 24 గంటలు చూడటం అంటే ప్రేక్షకులకు ఆసక్తి ఉండదు.
అదే కాకుండా టెక్నికల్ గా కూడా కంటిన్యూస్ లైవ్ ఇవ్వడం అనేది అసాధ్యమంటూ బుల్లి తెర వర్గాల వారు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆ షో కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని విశ్లేషకులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెగ్యులర్ బిగ్ బాస్ ఎలా అయితే ఒక రోజు ముందు జరిగింది చూపిస్తారో అలాగే ఈ షోలో కూడా ఒక రోజు ముందు జరిగినది చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఎడిటింగ్ అనేది లేదు అని అని వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కచ్చితంగా ఎడిటింగ్ తోనే షో ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం అందుతోంది. అది ఎలా ఉంటుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

bigg boss ott telugu streaming update
షో కు సంబంధించినంత వరకు ఒక్కరికి ఆసక్తిని రేకెత్తిస్తోంది. బిగ్బాస్ రోజుల్లో గంట లేదా రెండు గంటల చూడడమంటే ఓకే గాని 24 గంటలు చూడాలంటే మాత్రం కచ్చితంగా ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం ఉంది. కనుక బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ గా ఉండేలా క్రియేటివిటీతో ఎడిటింగ్ చేసి ఆ తర్వాత ప్రేక్షకులకు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రేక్షకులను ఇలా మోసం చేయబోతున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజులో 24 గంటల స్ట్రీమింగ్ ఇవ్వడంతో పాటు సపరేట్ గా గంటన్నర కంటెంట్ ను కూడా రోజు మొత్తంలో ఎడిట్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మొత్తానికి ప్రేక్షకులు ఏది చూడాలి అనుకుంటే అది చూసేయొచ్చు.