Bigg Boss OTT Telugu : ఆర్జే చైతు ఎలిమినేట్ అయితే బింధు మాధవి అంతగా ఎందుకు ఏడ్చింది?
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడవ వారంలో రేడియో జాకీ చైతు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆయన ఎలిమినేషన్ నిజంగా అందరికీ షాకింగ్. మొదటనే ఆయన ఎలిమినేషన్ గురించి ప్రచారం జరిగినా అంతా ఫేక్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చైతు ఎలిమినేట్ అంటూ ప్రకటించిన సమయం లో ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులు అంతా కూడా ఆశ్చర్యపోయారు. చైతూ మరియు స్రవంతి చివరికి నామినేషన్ లో మిగిలి ఉన్న సమయం లో కచ్చితంగా స్రవంతి ఎలిమినేట్ అవుతుంది అని ప్రతి ఒక్కరు భావించారు.
కానీ అనూహ్యంగా చైతూ ఎలిమినేట్ అవ్వడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇంటి సభ్యులు అంతా కూడా ఆ సమయంలో ఎమోషన్ అయ్యారు. ముఖ్యంగా బిందు మాధవి ఇంకా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు చాలా బాధ పడ్డారు. కచ్చితంగా ఉండాల్సిన కంటెస్టెంట్.. ఎంటర్టైన్మెంట్ విషయంలో అతడు చాలా బెటర్ అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్లో ఉన్న చాలా మంది తో పోలిస్తే ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఉన్నత స్థాయిలో అతడు ఉంటాడు. అతని మాటల జోరు కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు.అనూహ్యంగా అతడు ఎలిమినేట్ అవ్వడంతో ప్రేక్షకులు మరియు ఇంటి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Bigg Boss OTT Telugu why bindu madhavi cry when Rj chaitu eliminated
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్
ఈ సమయంలో బిందు మాధవి ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇద్దరి మధ్య ఎక్కువ ఉన్నట్లుగా ఏమీ అనిపించలేదు. అయినా కూడా ఆమె అంతగా కన్నీళ్లు పెట్టుకోవడం వెనక కారణం ఏమై ఉంటుంది. బెడ్ షీట్ కప్పుకొని మరి.. మైక్ తీసి పక్కకు పెట్టి మరి ఏడ్చింది. ఆ సమయంలో యాంకర్ శివ వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఆమె కన్నీళ్లు ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత కూడా బిందు మాధవి కళ్ళలోకి నీళ్ళు కనిపించాయి. ఇద్దరి మధ్య ఏర్పడిన బాండ్డింగ్ కి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చైతు కూడా ఆ తర్వాత మాట్లాడుతూ కచ్చితంగా బిందుమాధవి విజేత అంటూ చెప్పడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.