Shanmukh : బిగ్ బాస్ ష‌ణ్ముఖ్‌కి బంప‌ర్ ఆఫ‌ర్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shanmukh : బిగ్ బాస్ ష‌ణ్ముఖ్‌కి బంప‌ర్ ఆఫ‌ర్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసాడుగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :15 May 2022,5:30 pm

Shanmukh : యూట్యూబ‌ర్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న ష‌ణ్ముఖ్ బిగ్ బాస్ షోలో చేసిన రచ్చ‌కు త‌న ప్రేయ‌సి దీప్తి నుండి దూరంగా ఉండాల్సి వ‌చ్చింది, అంతేకాక చాలా మందితో నానా ప‌డాల్సి వ‌చ్చింది. సిరితో ఫ్రెండ్షిప్ అంటూ ఇద్ద‌రు చేసిన ర‌చ్చ అంద‌రికి తెలిసిందే. టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేలా మంచి గేమ్‌తో సత్తా చాటుకున్నాడు. బిగ్ బాస్ షోలో మంచి ఆటతీరుతో పేరు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్.. సిరి హన్మంత్‌తో రొమాన్స్ వల్ల విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశాడు.

అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో ఇమేజ్‌తో పాటు టైటిల్‌ను కూడా కోల్పోయాడు.బిగ్‌బాస్ లో పాల్గొని అంద‌రితో మాట‌లు ప‌డ్డ ష‌ణ్ముఖ్‌, సిరి ఇప్పుడు సరికొత్త సిరీస్ లతో వస్తున్నారు. అయితే ఈ సారి ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకులని పలకరించబోతున్నారు.. ఇటీవలే సిరి హన్మంత్‌ బీఎఫ్‌ఎఫ్‌ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నట్లు వెల్లడించగా తాజాగా షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌ సిరీస్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈమేరకు ఫస్ట్‌లుక్‌ కూడా విడుదలైంది. ఇన్వెస్టిగేషన్‌ త్వరలో ప్రారంభమవుతుందని, కేస్‌ వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించాడు.

Bigg Boss Shanmukh gets crazy offer

Bigg Boss Shanmukh gets crazy offer

Shanmukh : ష‌ణ్ముఖ్ అద‌ర‌గొట్టేస్తాడంతే..!

అటు బీఎఫ్‌ఎఫ్‌, ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌.. ఈ రెండూ కూడా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారం కానున్నాయి. దీంతో షన్ను, సిరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వీరిద్దరూ జాక్‌పాట్ కొట్టారంటూ టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇప్పుడు ‘క్విక్ ఫిక్షన్’ అనే సిరీస్‌తో కూడా సర్ ప్రైజ్ చేయబోతున్నారు. కేవలం వీళ్లిద్దరే కాకుండా సిరి ప్రియుడు శ్రీహాన్.. యూట్యూబర్స్ డాన్ పృథ్వీ, తేజ్ ఇండియా వీళ్లంతా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కాబోతున్నారు. స్టార్ మా మ్యూజిక్‌లో త్వరలో ప్రసారం కాబోతున్న ‘క్విక్ ఫిక్షన్’ సిరీస్‌ ప్రోమో ఇటీవ‌ల విడుదల కాగా.. ఇందులో సిరి, షణ్ముఖ్, శ్రీహాన్‌లు కనిపించి సందడి చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది