Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివ‌రి మెగా చీఫ్ ఎవ‌రు.. రేపు రెండు ఎలిమినేష‌న్సా..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 23 November 2024, 4:00 pm
  •  Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివ‌రి మెగా చీఫ్ ఎవ‌రు.. రేపు రెండు ఎలిమినేష‌న్సా..!

Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తాజా ఎపిసోడ్‌లో మెగా చీఫ్ గా రోహిణి ఎన్నిక అయ్యింది. టఫ్ టాస్క్ ల మధ్య చిట్ట చివరకు ఈ ఘనతను ఆమె సాధించింది. మెగా చీఫ్ అవ్వాలని పృథ్వీ చాలా ప్రయత్నం చేశాడు.ఒక్క సారి కూడా మెగా చీఫ్ అవ్వలేకపోయాడు. ఈసారి పృధ్వీ మెగా చీఫ్ అవుతాడు అని అంతా అనుకున్నారు. కాని అలా జ‌ర‌గ‌లేదు. వెన్నుపోటు వల్ల పృధ్వీ మెగా చీఫ్ అవ్వలేకపోయాడు. ఆటోలో కంటెండర్లు బజర్ మోగగానే వెళ్ళి కూర్చోవాలి. వారి సీట్ ను పదిలం చేసుకుంటూనే పక్కవారిని తోసేయాలి. ఇది టాస్క్. పృధ్వీ, విష్ణు, యష్మి, తేజ, రోహిణి. ఆటోలోకి వెళ్ళిసెటిల్అయ్యారు బట్ మొదట తేజను, ఆతరువాత రోహిణిని ఆటోలోంచి తోసేశారు.

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివ‌రి మెగా చీఫ్ ఎవ‌రు.. రేపు రెండు ఎలిమినేష‌న్సా..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివ‌రి మెగా చీఫ్ ఎవ‌రు.. రేపు రెండు ఎలిమినేష‌న్సా..!

Bigg Boss Telugu 8 : డ‌బుల్ ఎలిమినేష‌న్..

ఇక యష్మిని కూడా విష్ణు ప్రియ బయటకు తోసేప్రయత్నం చేసింది. విష్ణు ప్రియకు పృధ్వీ సాయం చేయడంతో యష్మి కూడా ఆటోలోంచి పడిపోయింది. దాంతో యష్మికి కోపం వచ్చింది. కావాలని పృధ్వీ విష్ణు తోకలిసి ఇలా చేశారని. ఇక మీరు లోపల ఉన్నారు కదా.. ఎలా ఆడతారో చూద్దాం.. ఖచ్చితంగా ఇద్దరు పుష్ చేసుకోవాలి. కాంప్రమైజ్ అయ్యి వస్తే ఊరుకునేది లేదు అంటూ గట్టిగా అరిచింది యష్మి. రోహిణి క్యారెక్టర్ గురించి విష్ణు మాట్లాడటంతో.. విష్ణు నిఖిల్ కు లైన్ వేసిందని.. వర్కౌట్ అవ్వక పృధ్వీ వైపుకు వెల్ళినట్టు రోహిణి నోరు జారింది. పైనల్ గేమ్ లో యష్మితో పాటు, విష్ణు ప్రియ కూడా ఆడటానికి అర్హత కోల్పోయారు. ఇక‌ కుండలనుబ్యాలన్స్ చేయాల్సి ఉండ‌గా, రోహిణికి సపోర్ట్ చేసేవారికి ఎక్కువ సార్లు ఛాన్స్ ఇచ్చింది. యష్మి. తేజ మధ్యలోనే డ్రాప్అవ్వడంతో.. చివరి నిమిషంలో చాలా ఉత్కంటగా సాగింది. చివరకు బ్యాక్ పెయిన్ కారణంగా పృధ్వీ బ్యాలన్స్ చేయలేకపోయాడు. రోహిణి మెగా చీఫ్ అయ్యింది. సోపృధ్వీ ఆటతీరును కూడా బిగ్ బాస్ మెచ్చుకున్నారు.

నవంబర్ 18, 19 రెండు రోజుల పాటు సాగిన బిగ్ బాస్ తెలుగు 8 12వ వారం నామినేషన్స్‌లో నిఖిల్, ప్రేరణ, యష్మీ, నబీల్, పృథ్వీ ఐదుగురు ఉన్నారు. వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ స్థానాలు మారిపోయాయి. దీంతో ఐదో స్థానంలోకి పృథ్వీ పడిపోయాడు. ఈ లెక్కన ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 8లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని బీబీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అంటే, ఈ వారం రెండు సార్లు ఎలిమినేషన్ ప్రక్రియ జరగనుంది. అది కూడా ఇవాళ ఒకరిని, రేపు మరొకరిని ఎలిమినేట్ చేయనున్నారని తెలుస్తోంది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి