Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలేకి టైం ఫిక్స్ అయింది.. గెస్ట్ ఎవరు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు?
ప్రధానాంశాలు:
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలేకి టైం ఫిక్స్ అయింది.. గెస్ట్ ఎవరు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు?
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం సీజన్ 8 జరుపుకుంటుండగా,ఇప్పుడు ఆ సీజన్ కూడా ముగింపు దశకు వచ్చింది. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా మొదలైన బిగ్‌బాస్.. ఊహించని ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఇప్పుడు రసవత్తరంగా మారింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగు పెడితే.. వారిని క్లాన్స్‌గా డివైడ్ చేసి గేమ్ ఆడించారు. ఆ తర్వాత 8 మంది వైల్డ్‌కార్డు ఎంట్రీలను హౌస్‌లోకి పంపి.. ఆసక్తిని క్రియేట్ చేశారు. ఆ తర్వాత అందరిని కలిపేసి ఒకే టీమ్ అంటూ కంటెండర్ పోటీలో ఫైట్ చేయమన్నారు. ఆసక్తికరంగా జరిగిన ఈ పోరులో ఏడుగురు మాత్రమే మిగిలారు. అయితే గత వారం టికెట్ టూ ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన అవినాష్ మినహా అందరు నామినేషన్స్‌లో ఉన్నారు.
Bigg Boss Telugu 8 ఫినాలే ఎప్పుడంటే..
అంటే విష్ణుప్రియ, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, రోహిణి, నబీల్ నామినేషన్‌లో ఉండగా, వీరిలో ఒకరు హౌజ్ నుండి బయటకు వెళ్లనున్నారు. అయితే టాప్ 5కి ఎవరు చేరుకుంటారు అనే దానిపై కూడా చర్చ నడుస్తుంది. అవినాష్ ఇప్పుడు టాప్ 5లో ఉండగా, మిగతా నలుగురు ఎవరు అని సోషల్ మీడియాలో జోరుగా డిస్కషన్ నడుస్తుంది. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం టాప్ 5 లో నిఖిల్, గౌతమ్, నబీల్, విష్ణుప్రియ, అవినాష్ ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏ సీజన్‌కీ లేనంత ప్రైజ్‌మనీ ఈ సీజన్లో వచ్చింది. ప్రస్తుతానికి సీజన్-8 ప్రైజ్ మనీ 54 లక్షల 30 వేలకి చేరింది. ఇది ఇంకా పెరిగే లేదా తగ్గే అవకాశం ఉందంటూ హోస్ట్ నాగ్ చెప్పారు.
బిగ్‌బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 15 ఆదివారం రాత్రి 7 గంటలకు టెలికాస్ట్ కానుందని సమాచారం. ప్రతి సీజన్ మొత్తం 105 రోజులు జరగనుంది. ఈ క్రమంలో డిసెంబర్ 15న ఫినాలే జరగనుంది. ఇక ఈసారి గ్రాండ్ ఫినాలేకి భారీ ఏర్పాట్లే చేయబోతున్నట్లు టాక్. ఒక స్టార్ హీరోయిన్‌ని చీఫ్ గెస్ట్‌గా తీసుకు రావడంతో పాటు పలు స్టార్ హీరోయిన్లతో ఆటపాటలు కూడా ఆడిస్తారని టాక్ నడుస్తుంది. అయితే గత సీజన్ కన్నా భిన్నంగా ఈ సీజన్‌ని నడిపించగా, అది అంతగా ప్రేక్షకులని అలరించలేకపోయిందని కొందరు చెబుతున్న మాట.